NTV Telugu Site icon

Manipur Violence: మ‌ణిపూర్లో ఆగని కాల్పుల మోత.. స్కూల్, ఇండ్లు దగ్ధం

Manipur

Manipur

మణిపూర్ లో హింసాకాండ ఆగడం లేదు. మ‌రోసారి కాల్పులకు పాల్పడ్డారు గుర్తు తెలియని దుండగులు. ఈ ఘటనలో ఒక పాఠ‌శాల‌, ప‌ది ఇళ్లకు నిప్పు పెట్టడంతో దగ్ధమ‌య్యాయి. రాష్ట్రంలో జాతి ఘర్షణల మధ్య ఇద్దరు గిరిజన మహిళలను బహిరంగంగా అవమానించడం, దూషించడం వంటి ఆందోళనకరమైన వీడియోలు వైర‌ల్ అయిన త‌ర్వాత అక్కడి ప్రజలు ఆగ్రహంతో ఉన్నారు. అంతేకాకుండా ఈ ఘటన పట్ల ప్రతిప‌క్ష నాయ‌కులు, ప్రజలు ప్రభుత్వం తీరుపై మండిపడుతున్నారు.

Viral Video: జేబులో ఫోన్ కొట్టేస్తే వీడియో చూసే దాకా తెలియలేదు.. జాగ్రత్త బాసూ!

మణిపూర్ లోని చురచంద్ పూర్ జిల్లాలో గత రెండ్రోజులుగా అనుమానిత ఉగ్రవాదులు, భద్రతా దళాల మధ్య ఎదరుకాల్పులు జరిగాయి. ఈ ఘటనలో ఒక మహిళ గాయపడగా, 10 పాడుబడిన ఇళ్లు, ఒక పాఠశాల దగ్ధమయ్యాయి. శనివారం సాయంత్రం జరిగిన ఈ దాడిలో భద్రతా సిబ్బందిపై పలు రౌండ్లు, స్థానికంగా తయారైన బాంబులు విసిరినట్లు పోలీసులు చెబుతున్నారు. రాష్ట్ర జాతి ఘర్షణల మధ్య ఇద్దరు గిరిజన మహిళలను బహిరంగంగా అవమానించడం, దూషించడం వంటి ఆందోళనకరమైన వీడియోను చిత్రీకరించిన తరువాత చురాచంద్ పూర్ లో భారీ నిరసన ర్యాలీలు కొనసాగుతున్నాయి. మరోవైపు ఈ ఘటనను ప్రధాని నరేంద్ర మోడీ, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఖండించారు. ఈ ఘర్షణను ప్రధాని మోడీ సిగ్గుచేటుగా అభివర్ణించారు. కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. రాజ్యాంగబద్ధమైన ప్రజాస్వామ్యంలో ఇది ఆమోదయోగ్యం కాదని సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్ అనడంతో ఈ ఘటనపై సుప్రీంకోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. నిందితులను పట్టుకునేందుకు, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఏ రకమైన చర్యలు తీసుకున్నారో తెలపాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.

Meenakshi Chaudhary : తెలుగులో మరో ఆఫర్ అందుకున్న హాట్ బ్యూటీ..?

మణిపూర్ లో కల్లోలం మే ప్రారంభంలో ప్రారంభమైంది. గిరిజన కుకీ ప్రజలు అనుభవిస్తున్న ఆర్థిక ప్రయోజనాలు, కోటాలను మెజారిటీ మైతీ జనాభాకు విస్తరించే అంశాన్ని పరిశీలించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరాయి. ఆ తరువాత ఈ ఘ‌ర్షణ‌లు చెలరేగాయి. మొదట్లో హింస తగ్గినప్పటికీ ఆ తర్వాత అడపాదడపా ఘర్షణలు, హత్యలు తిరిగి ప్రారంభం కావడంతో రాష్ట్రం అల్లకల్లోలంగా మారిపోయింది. ఈ ఘర్షణలో వందలాది మంది గాయపడగా.. 40,000 మందికి పైగా తమ ఇళ్లను వదిలి వెళ్లిపోయారు.

Show comments