ఓటీటీ లో వచ్చే వెబ్ సిరీస్ లకు మంచి క్రేజ్ ఉంటుందన్న విషయం తెలిసిందే.. ముఖ్యంగా హార్రర్, సస్పెన్స్, థ్రిల్లర్ జోనర్ సిరీస్‌లకు ఓ రేంజ్‌లో ఆదరణ ఉంటోంది.. ఇప్పటివరకు ఇక్కడ వచ్చిన అన్ని వెబ్ సిరీస్ జనాల ఆదరణ పొందాయి.. మంచి హిట్ టాక్ ను కూడా సొంతం చేసుకుంది.. ఇప్పుడు ఇదే కోవలో ప్రేక్షకులను భయపెట్టేందుకు మరో హార్రర్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ వచ్చేసింది. అదే కోలీవుడ్ స్టార్ హీరో ఆర్య నటించిన ది విలేజ్. టీజర్, ట్రైలర్‌తోనే ఆడియెన్స్‌ను భయపెట్టేసిన ఈ సిరీస్ ఈరోజు అర్ధరాత్రి నుంచే డిజిటల్ స్ట్రీమింగ్ కు వచ్చేసింది.
ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ లో ఇది స్ట్రీమింగ్ అవుతుంది.. తమిళంతో పాటు తెలుగు, కన్నడ, హిందీ, మలయాళ భాషల్లో ఆర్య వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ అవుతోంది. షమిక్ దాస్ గుప్త రచించిన గ్రాఫిక్ నవల ఆధారంగా డైరెక్టర్ మిళింద్ రావు ది విలేజ్ వెబ్ సిరీస్‌ను తెరకెక్కించారు. బీఎస్ రాధాకృష్ణన్ స్టూడియో శక్తి బ్యానర్‌పై ఈ సిరీస్‌ను నిర్మించాడు. ఇందులో ఆర్య సరసన దివ్య పిళ్లై హీరోయిన్‌గా నటిస్తోంది. ఆడుకులం నరేన్, ఆజియా, ముత్తుకుమార్, కలై రాణి, జార్జ్ ఎం, జాన్ కొక్కెన్, తలైవాసల్ విజయ్, అర్జున్ చిదంబరం మొదలగు వాళ్లు నటించారు..
ఈ సిరీస్ స్టోరీ విషయానికొస్తే.. ఆర్యతో పాటు అతని కుటుంబ సభ్యులు ప్రయాణిస్తున్న కారు అడవి మధ్యలో పాడైపోతుంది. సాయం కోసం పక్కనే ఉన్న ఒక ఊళ్లోకి వెళతారు. అయితే అక్కడ కొందరు వింత మనుషులు వారికి తారస పడతారు. కొన్నిఅతింద్రీయ శక్తులు హీరో భార్య పిల్లలను అపహరిస్తారు. మరి వారి నుంచి హీరో తన కుటుంబ సభ్యులను ఎలా కాపాడుకున్నాడు? అసలు వింత మనుషులెవరు? వారెందుకు అక్కడున్నారో తెలుసుకోవాలంటే ఈ సిరీస్ ను మిస్ అవ్వకుండా చూడాల్సిందే..
dive into the shadows as the eeriness unfolds 🫣#TheVillageOnPrime, watch now https://t.co/3hWlP55uxB@arya_offl @milindrau @ggirishh @DivyaPillaioffl @thespcinemas @DeerajVaidy @ActorMuthukumar @Aazhiya_ @highonkokken @Poojaram22 @kabalivishwanth @theabishekkumar… pic.twitter.com/cdBTelItWb
— prime video IN (@PrimeVideoIN) November 23, 2023
