NTV Telugu Site icon

Viral Video: ఏంటి తల్లి ఆ తొందర.. క్షణాల్లో గుండె ఆగినంత పనైంది..

Viral Railway

Viral Railway

చాలా మంది రైలు ప్రయాణం సౌకర్యంగా ఉంటుందని అందరు దాన్ని ఎంపిక చేస్తారు.. రోజుకు మన దేశావ్యాప్తంగా కోట్ల మంది ప్రయాణిస్తూన్నారు.. టికెట్ దొరికిందా, సీటు ఉందా లేదా అని మాత్రమే రైలు ఎక్కెటప్పుడు, దిగేటప్పుడు కాస్త జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు చెప్తూనే ఉంటారు.. కానీ కొందరు మాత్రం ఎక్కడో చోట పొరపాటు చేస్తారు.. ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు.. రైలు కదులుతున్న సమయంలో ఎక్కడం, దిగడం చెయ్యొద్దని పదే పదే చెప్తున్నా కొందరు మాత్రం ఎమౌతుందని అనుకుంటారు.. చివరికి ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు..

తాజాగా ఇటువంటి ఘటనే చోటుచేసుకుంది. రైల్వే స్టేషన్‌లో ట్రైన్ ఆగకముందే ఎక్కే ప్రయత్నం చేసింది ఓ అమ్మాయి. దీంతో ఒక్కసారిగా జారి రైలు, ప్లాట్‌ఫాం మధ్య ఉండే ఖాళీలో పడబోయింది. రైల్వే ప్రొటక్షన్ ఫోర్స్ సిబ్బంది ఈ విషయాన్ని గుర్తించి ఆ అమ్మాయిని లాగడంతో ఆమె ప్రాణాలతో బయటపడింది.. ప్లాట్ ఫారం మీదకు వస్తున్న రైలు లోకి ఆగక ముందే ఎక్కాలని ఓ అమ్మాయి ప్రయత్నించింది.. అంతే క్షణాల్లో ఆమె కింద పడిపోయింది..

అక్కడ ఉన్న సిబ్బంది వెంటనే అలెర్ట్ అయ్యి కిందకు లాగడంతో చిన్న గాయం కూడా లేకుండా బయటపడింది.. ఈ ఘటనకు సంబందించిన వీడియో అక్కడ ఏర్పాటు చేసిన సీసీటీవీ లో రికార్డు అయ్యింది.. ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.. సమయానికి ఆ ప్రయాణికురాలిని రైల్వే ప్రొటక్షన్ ఫోర్స్ సిబ్బంది చూశారు కాబట్టి ఆమె గాయాలు కాకుండా బయటపడింది. దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ప్రయాణికురాలి ప్రాణాలు కాపాడిన ఆర్పీఎఫ్ ఉద్యోగిని అధికారులు అభినందించారు..