Site icon NTV Telugu

Akhanda2 Thaandavam : 14 రిల్స్ కు తీర్పు అనుకూలంగా వచ్చిన రిలీజ్ కష్టమే

Akhanda 2 (4)

Akhanda 2 (4)

అఖండ 2 రిలీజ్ పై మద్రాస్ కోర్టులో వాదనలు ప్రారంభమయ్యాయి. ఒకవేళ తీర్పు 14 రీల్స్ కు అనుకూలంగా వచ్చినా కూడా అఖండ 2 రిలీజ్ కాకపోవచ్చు. విషయం ఏంటంటే అన్ని సమస్యలను పరిష్కరించుకుని, ఈ సాయంత్రం నాటికి సినిమాను విడుదలకు సిద్ధం చేసినా అది కేవలం ఇండియాలో మాత్రమే చేయగలరు. ఓవర్సీస్ లో అఖండ 2 కు కేటాయించిన థియేటర్స్ ను హాలీవుడ్ మూవీస్ కు కేటాయించారు.

Also Read : Akhanda2 Thandavaam : అఖండ 2.. కోర్టులో వాదనలు ప్రారంభం.. తీర్పుపై ఉత్కంఠ

చాలా పరిమిత ప్రదేశాలలో కొన్ని సింగిల్ స్క్రీన్ థియేటర్స్ తప్ప బిగ్గెస్ట్ చైన్ థియేటర్స్ ను ఓవర్సీస్ డిస్ట్రిబ్యూటర్లకు ఈ వారం దొరకవు. ఇప్పటికే అఖండ 2కి కేటాయించిన చాలా షోలు ‘జూటోపియా 2’ మరియు ‘వికెడ్: ఫర్ గుడ్’ కేటాయించి బుకింగ్స్ కూడా స్టార్ట్ చేసాయి. ఇప్పుడు ఆ స్క్రీన్స్ లో కొన్ని షోస్ అయిన తిరిగి అఖండ 2 కు కేటాయించడం అనేది డిస్టిబ్యూటర్స్ కు కష్టతరమైన పని అవుతుంది. అక్కడి డిస్ట్రిబ్యూటర్స్ సజావుగా విడుదల చేయాలనుకుంటే సినిమాను ఒక వారం వాయిదా వేయాలి. వారికీ అదే బెస్ట్ ఛాయిస్ గా కనిపిస్తోంది. ఒకేవేళ ఓవర్సీస్ ను కాదని ఇండియా వారీగా రిలీజ్ చేస్తారా అంటే అది అసలు జరగని పని. సో ఇప్పుడు మేకర్స్ కు ఉన్న బెస్ట్ డేట్ అంటే డిసెంబర్ 12. ఆ డేట్ మిస్ అయితే డిసెంబర్ 19 నుండి ‘అవతార్: ఫైర్ అండ్ యాష్’ థియేటర్లలోకి వస్తుంది. అప్పుడు అఖండ 2కి ఓవరీస్స్ లో తగిన స్క్రీన్‌లను పొందడం పంపిణీదారులకు కష్టమైన పని అవుతుంది. మొత్తనికైతే అఖండ 2 ఈ రోజు రిలీజ్ లేనట్టే.

Exit mobile version