Site icon NTV Telugu

Soldiers Salary: ఈ దేశ సైనికులకు రూ.1 కోటి జీతం.. కానీ వారు యుద్ధం చేయరు..

Soldiers Salary

Soldiers Salary

వాటికన్ సిటీ ప్రపంచంలోనే అతి చిన్న సైన్యాన్ని కలిగి ఉంది. ఈ సైన్యాన్ని స్విస్ గార్డ్ అని పిలుస్తారు. ఈ ఆర్మీ సిబ్బందికి లభించే సౌకర్యాలు చదివితే మీరు ఆశ్చర్యపోతారు. వాటికన్ సిటీ ప్రపంచంలోనే అతి చిన్న దేశం. ఇటలీ రాజధాని రోమ్ నగరంలో ఉంది. ఇక్కడ రోమన్ క్యాథలిక్ చర్చి ఉంది. పోప్ ఇక్కడే నివసిస్తున్నారు. వాటికన్ సిటీ చాలా ఆకర్షణీయంగా, అందంగా ఉంటుంది. ఇది ప్రపంచంలోనే అతి చిన్న దేశం. దాదాపు 100 ఎకరాల్లో విస్తరించి ఉంది. ఇక్కడ వెయ్యి మంది కంటే తక్కువ మంది నివసిస్తున్నారు. ప్రతి సంవత్సరం మిలియన్ల మంది ప్రజలు ఈ స్థలాన్ని సందర్శిస్తారు.

READ MORE: Kadiyam Srihari: కేటీఆర్ రేపో, మాపో జైలుకు పోవడం ఖాయం.. కడియం ఆసక్తికర వ్యాఖ్యలు

ఈ దేశ సైన్యం చాలా చిన్నదే. ఈ సైన్యంలో 150 కంటే తక్కువ మంది సైనికులు ఉన్నారు. వారు పోప్ రక్షణ బాధ్యతలు నిర్వర్తిస్తారు. పోప్‌ను రక్షించడానికి తమ ప్రాణాలు పణంగా పెడతామని వాగ్దానం చేస్తారు. ఈ సైనికులకు కొన్ని అర్హతలు ఉంటాయి. అవేంటంటే.. సైనికులు కాథలిక్కులు అయి ఉండాలి. ఇందులో పురుషులను మాత్రమే నియమించుకుంటారు. వీరి వయోపరిమితి 19 నుంచి 30 సంవత్సరాల మధ్య ఉంటుంది. సైనికుడి ఎత్తు 174 సెం.మీ. ఈ సైనికులు ఎప్పుడూ యుద్ధంలో పాల్గొనరు. వారికి పెద్ద ఎత్తున జీతం ఉంది. ఈ సైనికులు నెలకు €1,500 నుంచి €3,600 (అంటే రూ. 4.5 లక్షలు) వరకు జీతం పొందుతారు. ఇతర అలవెన్సులు, ఫ్రింజ్ బెనిఫిట్స్‌తో పాటు ఏడాదికి కోటి రూపాయల వరకు వేతనం పొందుతున్నారు.

READ MORE: Switzerland: స్విట్జర్లాండ్‌లో బుర్ఖా నిషేధం.. చట్టాన్ని అతిక్రమిస్తే ఫైన్ ఎంతంటే..!

Exit mobile version