NTV Telugu Site icon

Sunita Williams: సునీతా విలియమ్స్ స్పేస్‌క్రాఫ్ట్‌లో చిక్కుకున్నారని కథనాలు.. స్పందించిన యూఎస్ అంతరిక్ష సంస్థ

New Project (1)

New Project (1)

బోయింగ్‌కు చెందిన స్టార్‌లైనర్ స్పేస్‌క్రాఫ్ట్‌లో అంతరిక్ష కేంద్రానికి చేరుకున్న భారతీయురాలు సునీతా విలియమ్స్ ఇంకా కొంత కాలం పాటు అక్కడే ఉండాల్సి రావచ్చు. ఈ మిషన్ ను రూపొందించినప్పుడు తక్కువ రోజులే ఉంటుందని వెల్లడించారు. తాజాగా పరిస్థితులు మారాయి.. స్టార్‌లైనర్ మిషన్ వ్యవధిని 45 రోజుల నుంచి 90 రోజులకు పెంచేందుకు అమెరికా అంతరిక్ష సంస్థ పరిశీలిస్తోందని నాసా కమర్షియల్ క్రూ ప్రోగ్రామ్ మేనేజర్ స్టీవ్ స్టిచ్ తెలిపారు. అంతరిక్ష కేంద్రానికి చేరుకున్న వాళ్లు.. తిరిగి రావడానికి నిర్దిష్ట తేదీ ఇవ్వబడలేదు. ఈ నెల ప్రారంభంలో బోయింగ్ స్టార్‌లైనర్ అంతరిక్ష నౌక కక్ష్యలో ఉన్న ప్రయోగశాలకు పంపబడిన ఇద్దరు వ్యోమగాములు అనుమానాస్పద హీలియం లీక్ తర్వాత అక్కడ చిక్కుకున్నారని పలు నివేదికలు పేర్కొన్నాయి. నాసా వ్యోమగాములు సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్ అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ISS)లో చిక్కుకుపోయారని వచ్చిన వార్తలను US అంతరిక్ష సంస్థ బోయింగ్ అధికారులు ఖండించారు. నాసా కమర్షియల్ క్రూ ప్రోగ్రామ్ మేనేజర్ స్టీవ్ స్టిచ్ మాట్లాడుతూ.. ఆమె ఇప్పుడే ఇంటికి రావాలని అనుకోవడం లేదని పేర్కొన్నారు.

READ MORE: Pension Distribution: పెన్షన్‌దారులకు గుడ్‌న్యూస్‌.. రూ.4,400 కోట్లు విడుదల చేసిన ప్రభుత్వం

కాగా.. జూన్ ప్రారంభంలో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వెళ్లిన స్టార్ లైనర్ నౌక..హీలియం లీక్‌లు, థ్రస్టర్ అంతరాయాలతో సమస్యలను ఎదుర్కొంది. దీంతో అందులో అంతరిక్షానికి వెళ్లిన భారత సంతతికి చెందిన సునీతా విలియమ్స్ తో పాటు బుచ్ విల్మోర్‌లను భూమికి సురక్షితంగా తీసుకొచ్చేందుకు నాసా ప్రయత్నిస్తోందని వార్తలు వచ్చాయి. స్టార్ లైనర్ నౌక భూమికి తిరిగివచ్చే కచ్చితమైన తేదీ చెప్పలేమని నాసా చెబుతోందని.. స్టార్ లైనర్ నౌకలో ఎదురైన సమస్యలను అధ్యయనం చేసేందుకు నాసా తీవ్రంగా ప్రయత్నిస్తోందని..జాతీయ మీడియా సంస్థలు పేర్కొన్నాయి. తాజాగా స్పందించిన ప్రాజెక్ట్ నాసా, బోయింగ్ అధికారులు.. భూమికి తిరిగి వచ్చే ముందు మరింత తెలుసుకోవడానికి సమయాన్ని ఉపయోగిస్తున్నామని తెలిపారు. స్టేషన్ సురక్షితమైన ప్రదేశం అని పేర్కొన్నారు.