Site icon NTV Telugu

US- Somalia Conflict: సోమాలియాపై అమెరికా వైమానిక దాడి.. ముగ్గురు ఉగ్రవాదులు హతం

Somalia

Somalia

సోమాలియాపై నిన్న (మంగళవారం) అమెరికా సైన్యం వైమానిక దాడులు చేసింది. ఈ దాడిలో ముగ్గురు అల్-ఖైదా-సంబంధిత అల్-షబాబ్ మిలిటెంట్లు మరణించారు. పౌరులకు ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు అని యూఎస్ ఆర్మీ తెలిపింది. సోమాలియా ప్రభుత్వ అభ్యర్థన మేరకు దాడులు నిర్వహించినట్లు అమెరికా- ఆఫ్రికా కమాండ్ ఒక ప్రకటనలో తెలిపారు. కిస్మాయోకు ఈశాన్య దిశగా 35 కిలోమీటర్ల దూరంలో ఈ దాడి జరిగిందని వెల్లడించారు.

Read Also: Thalapathy Vijay : ఆ ప్రముఖ బ్యానర్ లో విజయ్ నెక్స్ట్ మూవీ ఫిక్స్..?

అయితే, ఈ దాడిలో మృతి చెందిన వారి వివరాలు ఇంకా వెల్లడి కాలేదు.. ఉగ్రవాద సంస్థ అల్-షబాబ్ నుంచి కూడా ఎలాంటి స్పందన రాలేదు.. ఆల్-షబాబ్ ప్రపంచంలోనే అల్ ఖైదా యొక్క అతిపెద్ద, అత్యంత క్రియాశీల నెట్‌వర్క్ అని అమెరిక- ఆఫ్రికా కమాండ్ ప్రకటనలో పేర్కొంది. అల్ షబాబ్ అమెరికన్ బలగాలపై దాడి చేయడంతో పాటు వాషింగ్టన్ యొక్క భద్రతా ప్రయోజనాలను బెదిరించడం కొనసాగిస్తున్నారని ఆరోపించారు.

Read Also: Ayodhya Ram Mandir: సికింద్రాబాద్‌ నుంచి అయోధ్యకు ప్రత్యేక రైళ్లు.. గోరఖ్‌పూర్‌ ఎక్స్‌ప్రెస్‌ కూడా!

ఇక, సోమాలియా ప్రభుత్వంపై తీవ్రవాద సంస్థలు 16 ఏళ్లుగా తిరుగుబాటును కొనసాగిస్తున్నాయి. అలాగే, పొరుగు దేశమైన కెన్యాలో ఉగ్రవాదులు పెద్ద ఎత్తున దాడులకు పాల్పడ్డారు. కెన్యా దళాలు సోమాలియాలో AU యొక్క శాంతి పరిరక్షక దళంలో భాగం, అల్-షబాబ్ కెన్యా సైనిక ఉనికికి దాడులతో ప్రతీకారం తీర్చుకుంటామని ప్రతిజ్ఞ చేసింది. అయితే, 2020లో అల్-షబాబ్ మిలిటెంట్లు కెన్యా తీరంలోఅమెరికా టెర్రరిజం నిరోధక దళాలు ఉపయోగించే ప్రధాన సైనిక స్థావరాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ దాడిలో ముగ్గురు యూఎస్ సైనికులను చంపేశారు.

Exit mobile version