NTV Telugu Site icon

Crime: ఉద్యోగం లేదన్న డిప్రెషన్‌తో మేనకోడలిని గొంతు కోసి హత్య చేసిన మామ..

China Knife Attack

China Knife Attack

మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో దారుణ సంఘటన వెలుగులోకి వచ్చింది. డిప్రెషన్‌తో బాధపడుతున్న ఓ యువకుడు తన మేనకోడలిని గొంతు కోసి హత్య చేశాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నిందితుడు ఫరాజ్ నిరుద్యోగం కారణంగా మానసికంగా కుంగిపోయాడు. అంతేకాకుండా.. తనకు ఉద్యోగం లేదని కుటుంబ సభ్యులు ఎప్పుడూ తిడుతుండే వారు.

Read Also: OG: ఓజీ కోసం రంగంలోకి మరో స్టార్ హీరో

వివరాల్లోకి వెళ్తే.. భోపాల్‌లోని జహంగీరాబాద్ ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఆదివారం అర్థరాత్రి ఫరాజ్ అనే యువకుడు తన మేనకోడలిని గొంతు కోసి హత్య చేశాడు. ఈ ఘటనపై డీసీపీ మాట్లాడుతూ.. జహంగీరాబాద్ పోలీస్ స్టేషన్‌ కు ఆదివారం రాత్రి మూడేళ్ల బాలిక హత్యకు సంబంధించిన సమాచారం అందిందని తెలిపారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.

Read Also: Supreme court: చలో సెక్రటేరియట్‌ ఘటనలో బెంగాల్ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ

నిందితుడు ఫరాజ్ సైన్స్ సబ్జెక్టులో పట్టభద్రుడు. అయితే.. తనకు ఎలాంటి ఉద్యోగం రాలేదన్న కారణంతో తనకు తానే కుమిలిపోయే వాడు.. దానికి తోడు కుటుంబ సభ్యులు కూడా నిరంతరం ఉద్యోగం లేదని తిట్టే వారు. ఈ క్రమంలో మానసిక ఆవేదనకు గురైన ఫరాజ్.. తన మేనకోడలు గొంతు కోసి హత్య చేశాడు. ప్రస్తుతం.. నిందితుడు ఫరాజ్ పోలీసుల అదుపులో ఉన్నాడు. ఈ ఘటనపై విచారణ చేపట్టిన పోలీసులు.. అతడిపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. నిందితుడిపై ఇండియన్ జస్టిస్ కోడ్ సెక్షన్ 103 (1) కింద హత్య సహా పలు సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు.

Show comments