Site icon NTV Telugu

Viral News: మొగుడు ఎందుకు మణీ వేస్ట్.. నాకు నేనే పెళ్లికి బెస్ట్

Untitled 12

Untitled 12

Viral news: మనిషి జీవితంలో పెళ్ళికి చాల ప్రాధాన్యత ఉంది. ఎందుకంటే కష్టసుఖాల్లో చివరి వరకు తోడుండేది కేవలం జీవిత భాగస్వామి మాత్రమే. అయితే మనకి నచ్చిన వ్యక్తిని అన్నివిధాలా మనకి సరిపోయే వ్యక్తిని ఎపిక చేసుకోవడం కష్టం. అయితే తల్లిదండ్రులు చూసిన సంబంధాలను చేసుకుని కష్టమో నష్టమో కలిసిబ్రతికేవాళ్లు కొందరు, ప్రేమించి పెళ్లిళ్లు చేసుకునే వాళ్ళు కొందరు, స్నేహితులని వదిలి ఉండలేక ఒకే జెండర్ వ్యక్తుల్ని పెళ్లి చేసుకునే వాళ్ళు కూడా ఉన్నారు. అయితే ఈ పెళ్లి మాత్రం కనివిని ఎరుగని రీతిలో జరిగింది. ఓ మహిళా తనని తానే పెళ్లి చేసుకుని ప్రభంజనం సృష్టించింది. ఈ వింత ఘటన లండన్ లో చోటు చేసుకుంది. వివరాలలోకి వెళ్తే.. లండన్ లో సారా విల్కిన్సన్ అనే మహిళ క్రెడిట్ కంట్రోలర్‌గా పని చేస్తున్నారు. కాగా ఆమె వయసు 42 సంవత్సరాలు. రెండు దశాబ్దాలుగా ఆమె తన వివాహం కోసం డబ్బులు ఆదా చేస్తూ వచ్చింది. అయితే ఆమె కోరుకున్న లక్షణాలు ఉన్న వరుడు ఆమెకి చిక్కలేదు.

Read also:Russia Arms Treaty: రష్యాకు ఉత్తరకొరియా ఆయుధాలు.. నిజాలను బయటపెట్టిన అమెరికా

దీనితో ఆమె ఓ నిర్ణయానికి వచ్చింది. తనకు సరైన జీవిత భాగస్వామి దొరకకపోవడంతో తనని తానే వివాహం చేసుకోవాలని నిర్ణయించుకుంది. ఈ నేపథ్యంలో నిశ్చితార్థపు ఉంగరాన్ని కూడా కొనుగోలు చేసింది. సఫోల్క్‌లోని ఫెలిక్స్‌స్టోవ్‌లోని హార్వెస్ట్ హౌస్‌లో ఆమె స్నేహితులు, బంధువుల సమక్షంలో ఆమె వివాహ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకలకు ఆమె దాదాపు 10 లక్షల రూపాయలు ఖర్చు చేసింది. ఇక మీడియా తో మాట్లాడిన సారా విల్కిన్సన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఆమె మాట్లాడుతూ ఈ రోజు నా పెళ్లి రోజు అయింది. నా పక్కన భాగస్వామి లేకపోవచ్చు కానీ నేను ఆ డబ్బులు నా పెళ్లి కోసం ఆదా చేసిన డబ్బులు మరి నాపెళ్ళి కి ఎందుకు ఉపయోగించకూడదు? అనే ప్రశ్నను లేవనెత్తారు.. దీనితో అందరూ ఆశ్చర్యపోయారు. అయితే తనకి అందరూ విష్ చేశారని, తనకి ఇప్పుడు చాల సంతోషంగా ఉందని చెప్పింది. అలానే పెళ్లి సందర్భంగా తాను 14 ప్రమాణాలను చేసుకున్నానని పేర్కొన్నారు.

Exit mobile version