మా ఊరి పొలిమేర సినిమా నేరుగా ఓటీటీలోనే విడుదల అయి ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్న సంగతి తెలిసిందే..మూఢనమ్మకాలు, చేతబడులు మరియు అనుమాస్పద మరణాల చుట్టూ తిరిగే ఈ మిస్టికల్ థ్రిల్లర్ ను ఓటీటీ ప్రేక్షకులు ఎంతగానో ఆదరించారు.ఇక ఇప్పుడు ఈ మూవీ సీక్వెల్ మా ఊరి పొలిమేర 2 రాబోతోంది.తాజాగా మా ఊరి పొలిమేర 2 ట్రైలర్ విడుదల అయింది.శనివారం (అక్టోబర్ 14) ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ ట్రైలర్ కూడా ఎంతో ఆసక్తి రేకెత్తిస్తుంది.ఊరి పొలిమేర గుడిలోని మిస్టరీ అలాగే చేతబడులు అనే కాన్సెప్ట్ పైనే ఈ సీక్వెల్ కూడా తెరకెక్కినట్లు తెలుస్తుంది.. మహబూబ్‌నగర్ లో దారుణం.. అసలు చేతబడులు నిజంగా ఉన్నాయా అనే టీవీ న్యూస్ ఛానెల్ వార్తలతో ట్రైలర్ మొదలవుతుంది.ఈ సీక్వెల్ ని మాత్రం థియేటర్లలో రిలీజ్ చేయాలని మేకర్స్ భావిస్తున్నారు.. నవంబర్ 3న మా ఊరి పొలిమేర 2 మూవీ రిలీజ్ కానుంది. తొలి పార్ట్ ను సూపర్ సస్పెన్స్ తో ముగించిన మేకర్స్.. సీక్వెల్లో మాత్రం సైన్స్, మూఢనమ్మకం మధ్య జరిగే యుద్ధాన్ని చూపించబోతున్నట్లు ట్రైలర్ చూస్తే అర్ధం అవుతుంది..
ఈ మూవీ తొలి పార్ట్ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ ఓటీటీలో రిలీజైంది.ఈ మూవీ లో సత్యమ్ రాజేష్, కామాక్షి భాస్కర్ల, గెటప్ శ్రీను, బాలాదిత్య, చిత్రం శీను, రవి వర్మ ముఖ్య పాత్రలు పోషించారు. ఇప్పుడు ఈ సీక్వెల్లో కూడా వారు ముఖ్యమైన పాత్రలు పోషించారు. మహబూబ్‌నగర్ లో జరిగిన దారుణ హత్యలకు, చేతబడులకు మధ్య ఉన్న లింకేంటి అనేది తెలుసుకోవడానికి ఓ పోలీస్ అధికారి బయలుదేరతాడు. అతని వెంటే ఓ ఆర్కియాలజిస్ట్ కూడా వెళ్తాడు.ఆ గ్రామంలోని ఆలయ మిస్టరీని ఛేదించడమే లక్ష్యంగా వీళ్లు పని చేస్తుంటారు.అయితే ఈ ట్రైలర్ లో సినిమాటోగ్రఫీ, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కూడా ఎంతో ఆసక్తికరంగా ఉంది.. మా ఊరి పొలిమేర మూవీతో పోలిస్తే.. ఈ సీక్వెల్ ను కాస్త భారీ బడ్జెట్ తోనే తెరకెక్కించినట్లు తెలుస్తుంది.. ఈ సినిమాను గౌరీ కృష్ణ నిర్మించగా.. డాక్టర్ అనిల్ విశ్వనాత్ స్టోరీ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం బాధ్యతలు వహించారు. ఈ సినిమాను జ్ఞానీ మ్యూజిక్ అందించారు.తెలుగులో కాంతారా, కార్తికేయ 2, విరూపాక్షలాంటి స్టోరీల కు మంచి ఆదరణ లభించడంతో మా ఊరి పొలిమేర 2 కూడా హిట్ అవుతుందన్న నమ్మకంతో మేకర్స్ ఉన్నారు.
