NTV Telugu Site icon

RGIA: విమానంలో ప్రయాణికులకు సాయం చేస్తూ నగదు స్వాహా చేస్తున్న ఘరానా దొంగ..పట్టుకున్న పోలీసులు

Courier Thief

Courier Thief

ఎంత నిఘా పెట్టినా.. దొంగ దొరలా మారుతాడా? తను చేతివాటాన్ని ఉపయోగించకుండా అస్సలు ఉండలేడు. తన పనితనాన్ని మరిచిపోతానేమో అని భయం ఏమో.. పోలీసులంటే భయాన్ని మాత్రం ఎప్పుడో మర్చిపోతున్నారు. దొంగతనాలు చేస్తున్న వారికి కఠినంగా శిక్షిస్తున్నా.. అవన్నీ పక్కన పెట్టేస్తున్నారు. సినిమాలు, సోషల్‌ మీడియాలను ఫాలో అవుతూ మరీ దొంగతనాలు.. దొంగ తనం చేసిన డబ్బులను, వస్తువులను సులుగా తీసుకెలుతుంటారు. ఇలాగే ఓ దొంగ విమానంలో తోటి ప్రయాణికులకు సహాయం చేస్తూ.. బంగారం విలువైన వస్తువులను దొంగిలిస్తున్నాడు. వృద్ధులు, మహిళలకు సహాయం చేస్తునట్లు నటించి లగేజ్ బ్యాగ్ లో వస్తువులు మాయం చేస్తున్నాడు ఢిల్లీ కి చెందిన రాకేష్ కపూర్.. రాకేష్ కపూర్ పై శంషాబాద్ ఎయిర్ పోర్ట్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఇప్పటికే 5 కేసులు, వనస్థలిపురంలో ఒక కేసు నమోదయ్యాయి.

READ MORE: Addanki Dayakar: “అన్నీ మీరే కదా చేసింది”..కేసీఆర్ పై అద్దంకి దయాకర్ ఫైర్

దీంతో నిందితుడిని పట్టుకునేందుకు ప్రత్యేక పొలీస్ బృందాని ఏర్పాటు చేశారు. పోలీసులు ఎయిర్ పోర్ట్ లోని సీసీ కెమెరాల అధారంగా రాకేష్ కపూర్ ను పోలీసులు గుర్తించారు. రాకేష్ ను ఎయిర్పోర్ట్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రాకేష్ వద్ద నుంచి కిలో బంగారం అభరణాలు స్వాధీనం చేసుకున్నారు. మరో ప్రధాన నిందితుడు దినేష్ గుప్తా పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. రాకేష్ కపూర్ విమానాల్లో ప్రయాణించి దొంగతనాలకు పాల్పడేందుకు దినేష్ గుప్తా ఆర్థిక సహాయం చేస్తున్నట్లు విచారణలో తేలింది. రకరకాల పేర్లతో ఐడి కార్డులు సృష్టించి వివిధ ప్రాంతాలకు వెళ్లే కనెక్టింగ్ విమానాల్లో ప్రయాణం చేస్తూ.. దొంగతనాలకు పాల్పడుతున్నట్లు పోలీసులు గుర్తించారు.