NTV Telugu Site icon

Jammu Kashmir: పుల్వామాలో మూడు దశాబ్దాల తర్వాత తెరుచుకున్న ఆలయ తలుపులు

New Project (12)

New Project (12)

జమ్మూకశ్మీర్‌లోని పుల్వామాలో 30 ఏళ్ల తర్వాత చారిత్రక ఆలయ తలుపులు తెరుచుకున్నాయి. ముర్రాన్ గ్రామంలో తెరిచిన ఈ బరారీ మౌజ్ ఆలయంలో కాశ్మీరీ పండిట్లు ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ముర్రాన్ గ్రామానికి చెందిన పండితులు, ముస్లిం ప్రజలు కలిసి ఆలయ తలుపులు తెరిచారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలతో పాటు ప్రసాదం పంపిణీ చేశారు. అలాగే ఇరు వర్గాల ప్రజలు కలిసి హోమం చేశాయి. మూడు దశాబ్దాల తర్వాత బరారీ మౌజ్ ఆలయాన్ని తెరవడం పట్ల గ్రామంలోని వలసేతర పండితులు చాలా సంతోషం వ్యక్తం చేశారు. దీనికి సంబంధించిన వీడియో కూడా బయటకు వచ్చింది. ఈ సమయంలో కాశ్మీరీ పండిట్ మాట్లాడుతూ.. “మేం ఎప్పటికీ ఇక్కడి నుంచి వెళ్లిపోనట్లు భావిస్తున్నాం. మమ్మల్ని ఎప్పుడూ చూడని ముస్లిం యువకులు మమ్మల్ని వారి తల్లిదండ్రుల స్నేహితులుగా చూస్తున్నారు. వారితల్లిదండ్రుల కంటే మమ్మల్ని ఎక్కువగా గౌరవించారు. బరారీ మౌజ్
ఆలయంలో భజనలు పాడే బృందం ముస్లిం సమాజానికి చెందినది. వారు కాశ్మీరీ పండిట్ల కోసం భజనలు చేస్తున్నారు.”

READ MORE: Central Cabinet: కేంద్ర మంత్రుల్లో ఎంత మంది పట్టభద్రులు ఉన్నారో తెలుసా?

భవిష్యత్తులో కూడా ఇలాంటి హోమాలు కొనసాగిస్తామని స్థానికులు తెలిపారు. కాగా.. పుల్వామా నుంచి ఉగ్రవాద కార్యకలాపాలకు సంబంధించిన వార్తలు వస్తుంటాయని విషయం మీకు తెలిసిందే. ఇది తీవ్రవాదుల కోటగా పరిగణించబడుతుంది. తాజాగా పుల్వామాలో రెండు పేలుడు పదార్థాలను కూడా భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. వీరితో పాటు లష్కరే తోయిబా (ఎల్‌ఈటీ)కి చెందిన ముగ్గురు ఉగ్రవాదులను కూడా అరెస్టు చేశారు. ఆదివారం ఇక్కడ నుంచి సుమారు ఆరు కిలోల పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నామని, దానిని ధ్వంసం చేసినట్లు పోలీసు అధికారి తెలిపారు. ఇక్కడ హిందూ- ముస్లింలు కలిసి ఉండటం పూజలు చేయడం స్ఫూర్తిదాయకంగా పరిగణించవచ్చు.