Site icon NTV Telugu

Mulugu: చల్పాక ఎన్‌కౌంటర్‌పై పలు అనుమానాలు.. అన్నంలో విషప్రయోగం..!

Mulugu Encounter

Mulugu Encounter

ములుగు జిల్లా చల్పాక దగ్గర అటవీ ప్రాంతంలో ఆదివారం తెల్లవారు జామున గ్రేహౌండ్స్ బలగాలు, మావోయిస్టులకు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఈ ఎదురు కాల్పుల్లో ఏడుగురు మావోయిస్టులు మృతి చెందారు. ఘటన స్థలంలో రెండు ఏకే-47 రైఫిల్స్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

Read Also: Hyderabad: గచ్చిబౌలిలో భారీగా గంజాయి పట్టివేత.. ముగ్గురు అరెస్ట్

కాగా.. ఈ ఎన్‌కౌంటర్ పై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయని పౌర హక్కుల సంఘం తెలంగాణ రాష్ట్ర కమిటీ పేర్కొన్నారు. ఈ ఎన్‌కౌంటర్ పై పలు అనుమానాలు ఉన్నాయని.. అన్నంలో విష ప్రయోగం జరిగినట్లు స్థానిక ప్రజలు వ్యక్తపరుస్తున్నారని తెలిపారు. చనిపోయిన ఏడుగురి మావోయిస్టు మృతదేహాలకు నిపుణులైన వైద్యుల పర్యవేక్షణలో శవ పరీక్షలు నిర్వహించాలని.. అలాగే ఎన్‌కౌంటర్ పై తెలంగాణ రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తిచే విచారణ జరిపించాలని పౌర హక్కుల సంఘం తెలంగాణ రాష్ట్ర కమిటీ డిమాండ్ చేస్తుంది.

Read Also: Upcoming Smart Phones: డిసెంబర్ నెలలో రాబోయే టాప్ బ్రాండ్స్ స్మార్ట్ ఫోన్స్ ఇవే

ప్రజాస్వామ్య పునరుద్ధరణ పేరుతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ.. సంవత్సరం కాలంలో మళ్లీ ఎన్‌కౌంటర్ తెలంగాణగా మార్చేసిందని ఆరోపించారు. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రాగానే కేంద్ర హోంమంత్రిని కలిసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పోలీసు క్యాంపులు ఏర్పాటు చేయాలని కోరడం.. ఆపరేషన్ కగార్‌ను తెలంగాణలో అమలుపరిచే విధంగా రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తున్నట్లు అర్థమవుతుందన్నారు. అడవిలో పోలీసు శోధన పేరుతో నిత్యం నిర్బంధాలను అమలుపరుస్తూ.. ఎన్‌కౌంటర్ల పేరుతో కాల్చి చంపడానికి పౌర హక్కుల సంఘం తెలంగాణ రాష్ట్ర కమిటీ తీవ్రంగా ఖండిస్తుందని తెలిపింది. ఈ క్రమంలో ఏటూరునాగారం ఎన్‌కౌంటర్‌లో పాల్గొన్న పోలీసులపై హత్య నేరం నమోదు చేయాలని పౌర హక్కుల సంఘం తెలంగాణ రాష్ట్ర కమిటీ డిమాండ్ చేసింది.

Exit mobile version