NTV Telugu Site icon

Bandhi Movie Teaser Release: అడవిలో హీరో ఆదిత్య ఓం ‘బంధీ’.. ఎలా బయటపడ్డాడో చూడండి

Bandi

Bandi

తిరుమల రఘు దర్శకత్వం వహిస్తున్న మొదటి చిత్రం.. ‘బంధీ’ టీజర్ విడుదలైంది. ప్రత్యేక కంటెంట్ చిత్రాలను చేస్తూ.. వస్తున్న ఆదిత్య ఓం ఈ సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా కూడా అదే రేంజ్ లో ఉంటుందని అభిమానులు ఆశిస్తున్నారు. గల్లీ సినిమా బ్యానర్ మీద ఈ మూవీని వెంకటేశ్వర రావు దగ్గు, తిరుమల రఘు నిర్మిస్తున్నారు. తిరుమల రఘు దర్శకత్వం వహించారు. నేడు ఈ చిత్రం నుంచి టీజర్‌ను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో.. దర్శక నిర్మాత రఘు తిరుమల తన అనుభవాన్ని పంచుకున్నారు. ఇది తకు మొదటి చిత్రమని తెలిపారు. ఈ ప్రయాణంలో ఎన్నో విషయాలు నేర్చుకున్నానన్నారు. ఆదిత్య ఓం సపోర్ట్ వల్లే ఈ మూవీని చేయగలిగాని హీరోను కొనియాడారు. ఆదిత్య ఓం ద్వారా కూడా చాలా విషయాలు నేర్చుకున్నానని చెప్పారు. సినిమాలో కేవలం ఒక్క కారెక్టరే ఉంటుందని.. ఆదిత్య వర్మ అనే పాత్రతోనే ఈ మూవీ ఉంటుందని స్పష్టం చేశారు.

READ MORE: Sangareddy: కూల్‌డ్రింక్‌లో మద్యం కలిపి బాలికపై అత్యాచారం.. నిందితుడికి మరణశిక్ష

ప్రకృతిని నాశనం చేస్తున్న కార్పోరేట్ కంపెనీలకు సపోర్ట్ చేసే పాత్రలో ఆదిత్య కనిపిస్తారని వెల్లడించారు. అలాంటి లీగల్ అడ్వైజర్ పాత్రని అడవిలో వదిలేస్తే ఏం జరుగుతుంది? అనేది చాలా ఆసక్తి కరంగా ఉంటుందని.. ప్రేక్షకులకు తప్పక నచ్చుతుందని ఆశించారు. ప్రకృతిని ఎలా కాపాడుతాడు? అనే అంశంపై కథ ఉంటుందని తెలిపారు. కరోనా మహమ్మరి అనంతరం ప్రకృతి మీద అందరికీ అవగాహన ఏర్పడిందని.. అందుకే ఈ కథను రాసినట్లు చెప్పుకొచ్చారు. ఆదిత్య ఓం గురించి మాట్లాడుతూ.. అతడు ఎంతో ఒదిగి ఉండేవారని.. టీంతో ఎంతో బాగా మెలిగేవారని గుర్తుచేసుకున్నారు. మూడేళ్లలో ఆయన్ను చాలా దగ్గర్నుంచి గమనించినట్లు చెప్పారు. ఆరేడు నెలల క్రితమే షూటింగ్ పూర్తయిందని పేర్కొన్నారు. ఆదిత్య సినిమాలో ఎక్కడా కూడా డూప్ వాడనివ్వలేదన్నారు. సొంతంగా యాక్షన్ సీక్వెన్స్ చేశారన్నారు. “ఆయన ఇప్పుడు బిగ్ బాస్ షోలో ఉన్నారు. పంచభూతాలతో అడవిలో మమేకమై ఉన్నారు. ఇప్పుడు బిగ్ బాస్ షోతో భిన్నమనస్తత్వాలు కూడిన మనుషులతో కలిసి ఉన్నాడు. సక్సెస్ అయి వస్తాడని ఆశిస్తున్నాను” అని దర్శక నిర్మాత రఘు తిరుమల పేర్కొన్నారు.

READ MORE: SC Sub Plan: ఎస్సీ సబ్‌ ప్లాన్‌ తీర్పుపై కమిటీ ఏర్పాటు..

ఈ కార్యక్రమానికి హాజరైన నరకాసుర నిర్మాత కారుమూరు తన మాట్లాడారు. రఘు ఈ చిత్రాన్ని బాగా తీశారని కొనియాడారు. సినిమాకి ఏం కావాలో అది చేశారన్నారు. ఆదిత్యను ఇరవై ఏళ్ల క్రితం కలిశానని.. ఆయన నన్ను ఇన్నేళ్లుగా ఎంకరేజ్ చేస్తూనే ఉన్నారని గుర్తు చేసుకున్నారు. సినిమాకు ఎంతో కొంత మంచి జరుగుతుందని అనుకున్నారని.. మనందరి కోసమే బిగ్ బాస్ షోకి వెళ్లారని చెప్పుకొచ్చారు. ఆయన వల్లే తనకు ఈ సినిమా అవకాశం వచ్చిందని స్పష్టం చేశారు. యూఎస్ డిస్ట్రిబ్యూటర్, వీఎఫ్ఎక్స్ హెడ్ జాకబ్ ప్రసంగించారు. రఘు ఎంతో ప్యాషన్‌తో ఈ సినిమాను తీశారని.. ఆదిత్య ఓం నటించిన లాహిరి లాహిరి లాహిరిలో, ధనలక్ష్మీ ఐలవ్యూ ఎన్నో చిత్రాలు విజయాన్ని సాధించాయని గుర్తుచేశారు. యూఎస్‌లో డిస్ట్రిబ్యూట్ చెయ్యడానికి సన్నాహాలు చేస్తున్నట్లు తెలిపారు.

 

Show comments