భారత సర్వోన్నత న్యాయస్థానం యొక్క అధికారిక యూట్యూబ్ ఛానెల్ హ్యాక్ కి గురైంది. సాధారణంగా రాజ్యాంగ ధర్మాసనం కేసులు, ప్రజా ప్రయోజనాల కేసుల విచారణలను ప్రత్యక్ష ప్రసారం చేయడానికి ఈ ఛానెల్ ఉపయోగించబడుతుంది. ఇటీవల, కోల్‌కతాలోని ఆర్‌జి కర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్‌లో డాక్టర్‌పై అత్యాచారం, హత్య కేసుపై విచారణ యూట్యూబ్‌లో ప్రత్యక్ష ప్రసారం చేయబడింది. ప్రస్తుతం, ఈ ఛానెల్ హ్యాక్ కి గురైన తర్వాత.. క్రిప్టోకరెన్సీకి సంబంధించిన వీడియోలు కనిపించాయి. క్రిప్టో కరెన్సీని ప్రమోట్ చేస్తున్నట్లుగా ఉన్న వీడియోలను పోస్ట్ చేయడం తీవ్ర కలకలం రేపింది. శుక్రవారం ఉదయం అమెరికాలోని రిపిల్ ల్యాబ్స్‌కు చెందిన క్రిప్టో కరెన్సీ ఎక్స్‌ఆర్పీని ప్రచారం చేస్తూ వీడియోలు కన్పించాయి.
READ MORE: Jasprit Bumrah: అరుదైన ఘనత సాధించిన టీమిండియా స్టార్ బౌలర్..
ఈ ఉదయం హ్యాక్ అయిన తర్వాత.. ఛానెల్ యొక్క అధికారిక లింక్ అమెరికన్ కంపెనీ రిప్పల్ ల్యాబ్స్ నుంచి ‘రిప్పల్’, క్రిప్టోకరెన్సీకి సంబంధించిన వీడియోలను చూపించింది. అయితే వీడియో ఓపెన్ చేయగా అందులో ఏమీ కనిపించలేదు. అంతేకాకుండా.. సుప్రీంకోర్టు వెబ్‌సైట్ నుంచి యూట్యూబ్ లింక్‌ను తెరవడానికి ప్రయత్నించినప్పుడు.. సుప్రీంకోర్టు విచారణకు ముందు కొన్ని వీడియోలు కూడా ప్రైవేట్‌గా మారడం కనిపించింది. ప్రస్తుతం ఆ ఛానెల్ లింక్ డీయాక్టివేట్ అయినట్లు సమాచారం. ఈ ఉల్లంఘనను సుప్రీంకోర్టు రిజిస్ట్రీ గమనించి తదుపరి చర్యలు తీసుకుంటోంది.