Site icon NTV Telugu

కేంద్ర ప్రభుత్వ తీరుపై సుప్రీంకోర్టు ఆగ్రహం

కేంద్ర ప్రభుత్వంపై సుప్రీం కోర్టు సీరియస్‌ అయింది. ట్రైబ్యునళ్ళలో ఖాళీల భర్తీ విషయం లో కేంద్ర ప్రభుత్వ తీరు పై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. సుప్రీంకోర్టు తీర్పులంటే గౌరవం లేదు… కోర్టు సహనాన్ని పరీక్షిస్తున్నారా…! అని సుప్రీం కోర్టు సీజేఐ ఎన్వీ రమణ ఫైర్‌ అయ్యారు. కేంద్రం వ్యవహరిస్తున్న తీరుపై అసహనం వ్యక్తం చేశారు సీజేఐ ఎన్వీ రమణ. ట్రిబ్యునళ్ళలో ఖాళీల భర్తీపై కేంద్రం వ్యవహరిస్తున్న విధానంపై మండిపడ్డారు సీజేఐ ఎన్వీ రమణ. ట్రిబ్యునల్స్‌ను మూసి వేయమంటారా ? అని కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. గతంలో రద్దు చేసిన అంశాలతో మళ్లీ మరో చట్టాన్ని పార్లమెంటు ఆమోదించడం ఏంటని సూటిగా ప్రశ్నించారు సీజేఐ ఎన్వీ రమణ. ఇక నైనా ఆ తీరును మార్చుకోవాలని హెచ్చరించారు.

Exit mobile version