Bachelor Party : ఓటీటీలోకి వచ్చేస్తున్న సూపర్ హిట్ కన్నడ కామెడీ మూవీ..స్ట్రీమింగ్ ఎక్కడంటే..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కన్నడ స్టార్ హీరో రక్షిత్ శెట్టి నిర్మించిన లేటెస్ట్ కామెడీ మూవీ బ్యాచిలర్ పార్టీ.కర్ణాటక రాష్ట్రంలో జనవరి 26న థియేటర్లలో విడుదలైన బ్యాచిలర్ పార్టీ మూవీ. రిలీజైన తొలి రోజు నుంచే మంచి టాక్ తెచ్చుకుంది. బ్యాచిలర్ పార్టీ మూవీ కడుపుబ్బా నవ్వించే మంచి కామెడీ సినిమా అని అక్కడి ప్రేక్షకులు ప్రశంసలు కురిపించారు. దాంతో పాటు సినిమాకు మంచి కలెక్షన్స్ కూడా వసూలు అయినట్లు సమాచారం. అలాంటి ఆ బ్యాచిలర్ పార్టీ మూవీ ఇప్పుడు సడెన్‌గా ఓటీటీలోకి వచ్చేస్తోంది.ప్రముఖ ఓటీటీ అమెజాన్ ప్రైమ్‌లో ఈ మూవీ స్ట్రీమింగ్ కానుంది. మార్చి 4 అంటే సోమవారం నుంచి బ్యాచిలర్ పార్టీ సినిమాను స్ట్రీమింగ్ చేయనున్నట్లు తాజాగా ప్రకటించారు. అంటే ఇంకా ఒక్క రోజు ఉందనగా దీనిపై అనౌన్స్ ఇచ్చింది అమెజాన్ ఓటీటీ సంస్థ. బ్యాచిలర్ పార్టీ సినిమాకు అభిజిత్ మహేష్ దర్శకత్వం వహించారు. పరమ్ వహ్ స్టూడియోస్ బ్యానర్‌పై రక్షిత్ శెట్టి మరియు జీఎస్ గుప్తా నిర్మాతలుగా వ్యవహరించారు.
ఈ మూవీలో దిగంత్, అచ్యుత్ కుమార్, యోగేష్, సిరి రవికుమార్, బాలాజీ మనోహర్, ప్రకాష్ తుమినాడ్, పవన్ కుమార్, శోభరాజ్ మరియు సుధ బెల్వాడీ తదితరులు నటించారు. అభిజిత్ మహేష్, వీరేష్ శివమూర్తి మరియు గణేష్ వశిష్ట మాటలు అందించిన ఈ సినిమాకు అరవింద్ ఎస్ కశ్యప్ సినిమాటోగ్రఫీ బాధ్యతలు చేపట్టారు. అర్జున్ రాము సంగీతం అందించారు. అయితే, అమెజాన్ ప్రైమ్‌లో బ్యాచిలర్ పార్టీ సినిమాను కేవలం కన్నడలోనే స్ట్రీమింగ్ చేస్తారా లేదా తెలుగులో కూడా డబ్ చేస్తారా అనేది తెలియాల్సి ఉంది.బ్యాచిలర్ పార్టీ సినిమా కథ విషయానికొస్తే.. భార్య-భర్తల మధ్య ఉండే చిన్న సమస్యలను కామెడీగా తెరకెక్కించినట్లు తెలుస్తోంది. సాఫ్ట్ వేర్ జాబ్ చేసే సంతోష్‌కు సంధ్య అనే అమ్మాయితో పెళ్లి అవుతుంది.అయితే వారి వైవాహిక జీవింతలో ఎలాంటి సంతోషం అనేది ఉండదు. భర్తను ఎలాంటి పార్టీలు కూడా చేసుకోనివ్వకుండా ఆఫీస్ నుంచి నేరుగా ఇంటికి వచ్చేయాలని కండిషన్ పెడుతుంది.అలాంటి సంతోష్ తన ఫ్రెండ్ బ్యాచిలర్ పార్టీలో తన పాత స్నేహితుడు మ్యాడీ మరియు పీటీ సర్లను కలుస్తాడు. ఆ తర్వాత ముగ్గురు కలిసి బ్యాంకాక్ వెళ్దామని నిర్ణయించుకుని వెళ్తారు. ఈ ప్రయాణంలో ఆ ముగ్గురు ఏం తెలుసుకున్నారు. బ్యాంకాక్‌లో వాళ్లు ఏం చేశారన్నదే బ్యాచిలర్ పార్టీ సినిమా కథ..
Also Read
- Rahul Gandhi: అంబానీని టార్గెట్ చేసిన ఎలాన్ మస్క్..‘‘మరో వ్యక్తి కూడా ఉన్నారు’’ అంటూ రాహుల్ సంచలన వ్యాఖ్యలు!
- OTR: నారాయణ్ ఖేడ్‌లో భూ మంతర్.. ఫామ్ ల్యాండ్స్ పేరుతో విచ్చలవిడి వెంచర్స్
- OTR: ఆర్టీసీ ఎన్నికలకు BRS దూరం ఎందుకు?
- US: భారతీయ ఐటీ సంస్థలకు అమెరికా షాక్.. గ్రీన్ కార్డ్ ప్రోగ్రామ్ నుంచి సస్పెన్షన్!
తాజావార్తలు
-
Vijay Deverakonda: ‘నా నమ్మకం బలుపు అనిపిస్తే తగ్గాలా?’.. ట్రోలర్లకు ఇచ్చిపడేసిన రౌడీ హీరో
-
Rahul Gandhi: అంబానీని టార్గెట్ చేసిన ఎలాన్ మస్క్..‘‘మరో వ్యక్తి కూడా ఉన్నారు’’ అంటూ రాహుల్ సంచలన వ్యాఖ్యలు!
-
Off The Record: మంత్రుల పనితీరుపై సీఎం చంద్రబాబు సీరియస్?
-
OTR: నారాయణ్ ఖేడ్‌లో భూ మంతర్.. ఫామ్ ల్యాండ్స్ పేరుతో విచ్చలవిడి వెంచర్స్
-
OTR: ఆర్టీసీ ఎన్నికలకు BRS దూరం ఎందుకు?
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!