Site icon NTV Telugu

Indelible Election Ink: ఎన్నికల్లో చెరగని ‘సిరా’ చరిత్ర తెలుసా..!

Election Ink India

Election Ink India

Indelible Election Ink: ఎన్నికల్లో చెరగని ముద్ర ఒకటి ఉంటుంది.. అదే సిరా గుర్తు. ఎప్పుడైనా ఆలోచించారా సిరా మరకల వెనక ఉన్న కథ గురించి. బీహార్ ఎన్నికల నేపథ్యంలో ఈ సిరా ముద్ర సందడి మళ్లీ వెలుగులోకి వచ్చింది. ఇందులో హైలెట్ ఏంటంటే భారతదేశం నుంచి ఈ సిరాను ముప్పై ఐదు దేశాలు కొనుగోలు చేస్తున్నాయి. ఇంతకీ ఈ సిరా కథ ఏంటి, ఎన్నికలకు దీనికి మధ్య సంబంధం ఏంటి, ఎప్పటి నుంచి ఈ సిరాను ఎన్నికల్లో వాడుతున్నారు, దీనికి ఉన్న ప్రత్యేకత ఏంటి అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం..

READ ALSO: Pakistan’s Nuclear Threat: భారత్ శక్తి ముందు పాక్ అణ్వాయుధాలను తోకముడుస్తాయా! దాయాది అణు సామర్థ్యం ఎంత?

ఈ సిరా మూలాలు చాలా ఆసక్తికరంగా ఉన్నాయి. భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత 1951-52లో మొదటి సార్వత్రిక ఎన్నికలు జరిగినప్పుడు అనేక ఓటు చోరీ కేసులు నమోదయ్యాయి. ఈ కేసులు అన్ని ఎన్నికల కమిషన్‌కు చేరుకున్నాయి. దీనికి పరిష్కారం కోసం వాళ్లు వివిధ ఆలోచనలను ముందుకు తెచ్చారు. చివరగా ఎన్నికల కమిషన్ ఓటరు వేలుపై సులభంగా చెరిపివేయలేని ఒక గుర్తును సృష్టించాలని నిర్ణయం తీసుకుంది. చాలా చర్చల తర్వాత, కమిషన్ ఒక పరిష్కారాన్ని కనుగొనడానికి నేషనల్ ఫిజికల్ లాబొరేటరీ ఆఫ్ ఇండియాను సంప్రదించింది.

పరిష్కారం ఎలా వచ్చిందంటే..
దీని పరిష్కారం కోసం ఎన్నికల కమిషన్ నేషనల్ ఫిజికల్ లాబొరేటరీ ఆఫ్ ఇండియా (NPL)ని సంప్రదించింది. అప్పుడు NPL నీరు లేదా రసాయనాల ద్వారా తుడిచివేయలేని ఒక సిరాను అభివృద్ధి చేసింది. ఈ సిరాను మైసూర్ పెయింట్ వార్నిష్ కంపెనీకి ఉత్పత్తి చేయడానికి ఆర్డర్ ఇచ్చింది. ఆ కంపెనీ ఓటింగ్ రుజువుగా మారిన ఈ సిరాను అభివృద్ధి చేసింది. నాటి నుంచి కర్ణాటకలోని మైసూర్‌లోని ఇదే కంపెనీ ఎన్నికల సిరాను ఉత్పత్తి చేస్తోంది. మైసూర్‌లో దీనిని రహస్య సూత్రాన్ని ఉపయోగించి ఉత్పత్తి చేస్తారు.

1971 ముందు వరకు వేలికి చెరగని సిరా వేసేవారు, కానీ ఈలోగా ప్రజలు దానిని ఉపయోగించడానికి నిరాకరించినట్లు అనేక నివేదికలు వెలువడ్డాయి. వారణాసికి చెందిన ఒక యువతి తన పెళ్లి రోజున తన వేలిపై ఉన్న గుర్తు ఆకర్షణీయంగా లేనందున దానిని వేసుకోడానికి నిరాకరించింది. ఇలాంటి సంఘటనల తరువాత ఎన్నికల కమిషన్ 1971లో నియమాలను సవరించింది. ఈ సిరాను వేలుగోళ్లకు బదులుగా గోళ్లకు వర్తించే పద్ధతిని ప్రవేశపెట్టింది. 1952లో నేషనల్ ఫిజికల్ లాబొరేటరీ ఆఫ్ ఇండియా (NPL) ద్వారా సృష్టించిన ఈ సిరా, కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ శాస్త్రవేత్తల కృషి ఫలితం అని అధికారులు వెల్లడించారు. దీని ఉత్పత్తిలో సిల్వర్ నైట్రేట్ ఉపయోగిస్తారు. సిరాలోని సిల్వర్ నైట్రేట్ శరీరంలోని సోడియంతో కలిసి సోడియం క్లోరైడ్‌ను ఏర్పరుస్తుంది, దీని వలన నీలిరంగు సిరా నల్లగా మారుతుంది అని సైన్స్ చెబుతుంది. నీటితో తాకినప్పుడు ఇది చిక్కగా మారుతుందని, సబ్బు కూడా దీనిని తొలగించడానికి పనికిరాదు.

వాస్తవానికి దీని పూర్తి ఫార్ములా నేటికీ రహస్యంగానే ఉంది. నేషనల్ ఫిజికల్ లాబొరేటరీ ఆఫ్ ఇండియా లేదా మైసూర్ పెయింట్స్ అండ్ వార్నిషెస్ లిమిటెడ్ దీనిని బహిరంగంగా ఇప్పటి వరకు ప్రకటించలేదు. ముఖ్యంగా మైసూర్‌కు చెందిన కంపెనీ తప్ప మరే ఇతర కంపెనీకి ఈ సిరాను తయారు చేసే హక్కు లేదు. ఇదే మైసూర్‌కు చెందిన కంపెనీ దశాబ్దాలుగా ఈ చెరగని సిరాను ఉత్పత్తి చేస్తోంది. అలాగే ప్రపంచవ్యాప్తంగా 35 కి పైగా దేశాలకు ఎగుమతి చేస్తోంది. ఇది చెరగని సిరా స్టోరీ..

READ ALSO: Women’s World Cup 2025: మహిళల ప్రపంచ కప్‌లో 22 వికెట్లు తీసిన డీఎస్పీ.. ఆమె ఎవరో తెలుసా?

Exit mobile version