NTV Telugu Site icon

Pushpa 2 Second Single : 6 భాషల్లో పాట పాడిన ఆ స్టార్ సింగర్..?

Shreya Goshal

Shreya Goshal

Pushpa 2 Second Single : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్ లో వచ్చిన “పుష్ప” సినిమా ఎంతటి ఘన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.ప్రస్తుతం ఆ సినిమాకు సీక్వెల్ గా పుష్ప 2 తెరకెక్కుతుంది.ఈ సినిమాలో కూడా రష్మిక మందన్నా హీరోయిన్ గా నటిస్తుంది.పుష్ప 2 సినిమా ను మైత్రి మూవీ మేకర్స్ ఈ సారి మరింత భారీగా తెరకెక్కిస్తున్నారు. ఈ బిగ్గెస్ట్ పాన్ ఇండియా మూవీ ఆగస్టు 15వ తేదీన థియేటర్లలో గ్రాండ్ గా రిలీజ్ కానుంది.ఇప్పటికే ఈ సినిమా నుండి మేకర్స్ రిలీజ్ చేసిన పోస్టర్స్ ,టీజర్ ,సినిమాపై భారీగా అంచనాలు పెంచేసింది.ఇదిలా ఉంటే మేకర్స్ ఈ సినిమా నుండి ఫస్ట్ సింగిల్ ను రిలీజ్ చేసారు.”పుష్ప పుష్ప” అంటూ సాగే ఈ పాట ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది.

Read Also :Prasanna Vadanam : అరుదైన ఘనత సాధించిన సుహాస్ ప్రసన్న వదనం..

తాజాగా ఈ సినిమా నుంచి మేకర్స్ సెకండ్ సింగిల్ అప్డేట్ అందించారు.రష్మిక ,అల్లుఅర్జున్ మధ్య సాగే కపుల్ సాంగ్ అంటూ మేకర్స్ తాజాగా ప్రోమోను రిలీజ్ చేసారు.ఈ కపుల్ సాంగ్ మే 29 ఉదయం 11 .07 గంటలకు రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు.తాజాగా ఈ సాంగ్ గురించి మేకర్స్ స్పెషల్ అప్డేట్ ఇచ్చారు.ఈ కపుల్ సాంగ్‍ను స్టార్ సింగర్ శ్రేయా ఘోషల్ పాడారు.ఆమె తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళం, బెంగాలీ ఇలా ఆరు భాషల్లో పాడారు. ఈ సినిమాకు దేవీ శ్రీప్రసాద్ అద్భుతమైన మ్యూజిక్ అందించారు.ప్రస్తుతం ఈ సాంగ్ కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు.

Show comments