Site icon NTV Telugu

Thulasivanam : ఓటీటీలోకి వచ్చేస్తున్న రొమాంటిక్ కామెడీ వెబ్ సిరీస్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..?

Whatsapp Image 2024 03 17 At 12.05.15 Pm

Whatsapp Image 2024 03 17 At 12.05.15 Pm

టాలెంటెడ్ డైరెక్టర్ తరుణ్ భాస్కర్ సమర్పణలో అక్షయ్, ఐశ్వర్య, వెంకటేష్ కాకమాను మరియు విష్ణు ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ తెలుగు వెబ్ సిరీస్ తులసీవనం.న్యూ ఏజ్ రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్‌గా తెరకెక్కిన ఈ సిరీస్‌కు అనిల్ రెడ్డి దర్శకత్వం వహించారు. తాజాగా తలసీవనం ట్రైలర్ ను విడుదల చేశారు. ఇందులో లవ్ రొమాంటిక్ కామెడీతోపాటు క్రికెట్ నేపథ్యం ఉన్నట్లు ట్రైలర్ చూస్తుంటే తెలుస్తోంది.”జనరల్‌గా మైండ్ కి క్రియేటివ్ థాట్స్ వస్తాయి కదా.. అవి ఇట్ల అనగానే అట్ల జరిగిపోతాయి’ అంటూ తులసి ( అక్షయ్) డైలాగ్‌తో మొదలైన ట్రైలర్ ఆద్యంతం ఎంతగానో ఆకట్టుకుంది. ఫ్యామిలీ, ఫ్రెండ్‌షిప్, లవ్, కామెడీ మరియు రొమాంటిక్ ఎలిమెంట్స్ ఎంతగానో అలరించాయి. స్ట్రీట్ క్రికెట్ టోర్నమెంట్ నేపథ్యంలో వచ్చే సన్నివేశాలు నవ్వులు పూయించాయి.. అక్షయ్, ఐశ్వర్య, విష్ణు తమ కామెడీ టైమింగ్‌తో కడుపుబ్బా నవ్వించారు.

దర్శకుడు అనిల్ రెడ్డి న్యూ ఏజ్ కంటెంట్‌ని చాలా అద్భుతంగా ప్రజెంట్ చేశారు. స్మరన్ నేపథ్య సంగీతం ఫన్‌ని మరింత ఎలివేట్ చేసింది.మొత్తానికి తులసీవనం ట్రైలర్ క్యురియాసిటీని పెంచింది. ఇక ట్రైలర్ చివర్లో “చెన్నై ఎప్పుడైనా ఓడిపోవడం చూసినవారా.. అది ఆర్సీబీపై.. సాలా కప్ నమ్ దే” అని డైలాగ్ ఆకట్టుకుంది.రొమాంటిక్ కామెడీ జోనర్‌లో వస్తోన్న తులసీవనం వెబ్ సిరీస్‌ ప్రముఖ తెలుగు ఓటీటీ సంస్థ ఈటీవ్ విన్‌లో మార్చి 21 నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఇదిలా ఉంటే తులసీవనం ఓటీటీ రిలీజ్ డేట్ దగ్గరపడుతుండటంతో ట్రైలర్ లాంచ్ గ్రాండ్‌గా ఏర్పాటు చేశారు. ఈ ఈవెంట్‌లో సిరీస్‌ను సమర్పిస్తున్న డైరెక్టర్ తరుణ్ భాస్కర్ పాల్గొన్నారు.అనిల్, తులసి పెళ్లి చూపులు నుంచి నాకు సహాయ దర్శకులుగా ఉన్నారు. మాది విడదీయలేని ఓ అనుబంధం(నవ్వుతూ). తులసి అనే పేరు పెట్టాడు కానీ ఇది అనిల్ పిక్చరే. చాలా మంది ఫిల్మ్ మేకర్స్‌కి సొంత గొంతుక చెప్పాలనే తాపత్రయం ఉన్నప్పటికీ మార్కెట్ దృష్ట్యా కొన్ని భయాలు ఉంటాయి. ఇలాంటి ప్రాజెక్ట్స్ చేయడం వెనుక అందరి కృషి ఉంది. క్లారిటీ థీం అనేది చాలా ముఖ్యం. తులసీవనంలో ఆ క్లారిటీ ఉంటుంది” అని తరుణ్ భాస్కర్ తెలిపారు.

Exit mobile version