Site icon NTV Telugu

The Road: ఓటీటీలోకి వచ్చేసిన త్రిష నటించిన లేటెస్ట్‌ సస్పెన్స్‌ థ్రిల్లర్‌..

Whatsapp Image 2023 11 10 At 6.54.58 Pm

Whatsapp Image 2023 11 10 At 6.54.58 Pm

స్టార్ హీరోయిన్ త్రిష ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూ అదరగొడుతుంది.. ఈ భామ దళపతి విజయ్ సరసన నటించిన లియో మూవీ దసరా కానుకగా విడుదల అయి అదిరిపోయే కలెక్షన్స్ రాబట్టింది.. అలాగే త్రిష స్టార్ హీరోల సరసన నటిస్తూనే లేడీ ఓరియెంటెడ్ మూవీస్ కూడా చేస్తుంది. త్రిష నటించిన లేటెస్ట్‌ క్రైమ్‌ సస్పెన్స్‌ థ్రిల్లర్‌ ‘ది రోడ్‌’.. రివెంజ్ ఇన్ 462 కిలో మీటర్స్ అనేది మూవీ క్యాప్షన్.ఈ లేడీ ఓరియంటెడ్‌ మూవీని అరుణ్ వశీగరన్ తెరకెక్కించారు.. ఈ మూవీ అక్టోబర్‌ 10వ తేదీన థియేటర్లలో విడుదలైంది.తమిళనాడులో జాతీయ హైవేలపై జరిగిన కొన్ని యథార్థ సంఘటనల ఆధారంగా ఈ మూవీని తెరకెక్కించారు. ఈ మూవీ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. అలాగే త్రిష నటన ప్రేక్షకులను మెప్పించింది… తెలుగులో కూడా ది రోడ్‌ సినిమా కు మంచి కలెక్షన్లు వచ్చాయి. థియేటర్లలో ప్రేక్షకులను అలరించిన ది రోడ్ ఇప్పుడు డిజిటల్‌ స్ట్రీమింగ్‌కు వచ్చేసింది.

ప్రముఖ తెలుగు ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ ఆహా ది రోడ్ డిజిటల్‌ స్ట్రీమింగ్‌ హక్కులను సొంతం చేసుకుంది. శుక్రవారం (నవంబర్‌ 10) అర్ధరాత్రి నుంచి ది రోడ్‌ మూవీని ఓటీటీలోకి అందుబాటులోకి వచ్చింది… ప్రస్తుతం తెలుగుతో పాటు తమిళ్‌లోనూ ఈ మూవీ అందుబాటులో ఉంది. ది రోడ్‌ మూవీలో మలయాళ నటుడు షబీర్ ప్రధాన పాత్ర పోషించాడు. త్రిష స్నేహితురాలిగా మియా జార్జ్ మరియు కానిస్టేబుల్ పాత్రలో భాస్కర్ ముఖ్య పాత్రల్లో మెప్పించారు. ఏఏఏ బ్యానర్‌పై తెరకెక్కిన ఈ చిత్రానికి శ్యామ్‌ సీఎస్‌ మ్యూజిక్ అందించారు.. నేషనల్‌ హైవేలోని ఒక ప్రదేశంలో వరుసగా హత్యలు జరుగుతాయి. అసలు ఈ హత్యల వెనక వున్న రహస్యం ఏమిటి దాని వెనక ఉన్నది ఎవరు అనేది తెలుసుకోవడానికి త్రిష ప్రయత్నిస్తుంది. ఈ క్రమంలో త్రిషకు ఎలాంటి అనుభవాలు ఎలాంటి ఎదురయ్యాయో తెలుసుకోవాలంటే ది రోడ్‌ మూవీ కథ..మరి థియేటర్లలో పాజిటివ్ రెస్పాన్స్ అందుకున్న ఈ క్రైమ్‌ సస్పెన్స్‌ థ్రిల్లర్‌ ఓటీటీ లో ఏవిధంగా ఆకట్టుకుంటుందో చూడాలి..

Exit mobile version