NTV Telugu Site icon

Bus Accident: విజయవాడ బస్సు యాక్సిడెంట్ పై నివేదిక

Bus Accident

Bus Accident

విజయవాడ పండిట్ నెహ్రూ బస్టాండులో దుర్ఘటనతో అందరూ ఒక్కసారిగా అవాక్కయ్యారు. ఈ బస్సు యాక్సిడెంట్ పై నివేదిక సిద్ధమైంది. నివేదికపై అధికారులతో ఏపీఎస్ఆర్టీసీ ఎండీ ద్వారకాతిరుమల రావు చర్చిస్తున్నారు. మానవ తప్పిదమే ప్రధాన కారణంగా అధికారులు గుర్తించారు. గేర్ మార్చడంలో డ్రైవర్ తప్పిదంగా టెక్నికల్ టీం గుర్తించింది. నివేదికపై అధికారులతో చర్చించిన అనంతరం ఏపీఎస్ ఆర్టీసీ యాజమాన్యం చర్యలు తీసుకోనుంది.

Read Also: Shakib Al Hasan: నా జట్టు గెలుపు కోసం ఏమైనా చేయాలనిపించింది.. మాథ్యూస్‌ టైమ్డ్‌ ఔట్‌పై షకిబ్‌!

అయితే, వోల్వో బస్సు డ్రైవింగ్ పై ఎన్టీవీకి డ్రైవర్లు క్లారిటీ ఇచ్చారు. గుంటూరు నాన్ స్టాప్ వోల్వో బస్సు డ్రైవర్ మాట్లాడుతూ.. నేను బెంగళూరు వెళ్ళి శిక్షణ పొంది వచ్చాను అని తెలిపారు. ఇది అంతా ఆటోమేటెడ్ వోల్వో బండి.. గేర్లు, బ్రేకులు లాంటి ఇబ్బందులు తక్కువ.. ఒక్క సారి ఆగితే ఏనుగు లాగినా కదలదు.. నిన్న ప్రమాదం ఎలా జరిగిందో అర్ధం కాలేదు.. డ్రైవర్లకు ఒత్తిడులు ఉంటాయి.. బస్సు ఎక్కిన తరువాత గమ్యం చేరే వరకూ జాగ్రత్తలు చాలా అవసరం అని ఆయన పేర్కొన్నారు. బస్సు ఏది ఇచ్చినా డ్యూటీ ఎక్కాల్సిందే.. డ్యూటీ ఎక్కాక బస్సు కండిషన్ చూసుకోవాలి.. కండిషన్ బాగోకపోతే డిపోలోకి వెళ్ళి బాగు చేయించుకోవాలి అని గుంటూరుకు చెందిన వోల్పో బస్సు డ్రైవర్ పేర్కొన్నారు. ఈ బస్సుకి డ్రైవ్, స్టాప్, రివర్స బటన్లు ఉంటాయి.. గేర్లు ఆటోమేటెడ్ అని తెలిపారు.