Site icon NTV Telugu

The Raja Saab : ది రాజా సాబ్ OTT డీల్ ఫైనల్.. రికార్డు ధరకు దక్కించుకున్న ప్రముఖ సంస్థ!

The Raja Sab

The Raja Sab

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న వరుస ప్రాజెక్ట్ లో ది రాజా సాబ్ ఒకటి. మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న రొమాంటిక్ కామెడీ హారర్ మూవీ డిసెంబర్ 5 న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ప్రభాస్ ఫ్యాన్స్ కోసం ఈ సినిమాకి సంబంధించి అప్ డేట్ లు విడుదల చేస్తూనే ఉన్నారు. ఇప్పటికే టీజర్ సాంగ్ విడుదల కాగా టీజర్ లో ప్రభాస్ వింటేజ్ లుక్‌లో కనిపిస్తూ ఫ్యాన్స్‌ను ఆకట్టుకుంటున్నారు. హారర్ ఎలిమెంట్స్ పాటు ఫన్నీ డైలాగులు , విజువల్స్ తో టీజర్ చాలా అట్రాక్టివ్‌గా ఉంది. డిఫరెంట్ జానర్‌లో వస్తున్న ఈ మూవీ ఇప్పటికే మంచి బజ్ సొంతం చేసుకోగా టీజర్ మరింత అంచనాలు పెంచేసింది. అయితే థియేటర్ రిలీజ్ పక్కన ఉంచితే ఈ సినిమాపై ఓ పెద్ద ప్రశ్న మాత్రం అన్ని వర్గాల్లో చక్కర్లు కొడుతూ ఉంది.. అదే OTT హక్కులు?

Also Read : Janhvi Kapoor : ఆ విషయంలో జాన్వీ‌కి సపోర్ట్ చేస్తూ.. ప్రియాంక పోస్ట్ వైరల్!

ప్రభాస్‌ గత సినిమాలు ‘సలార్’, ‘ఆదిపురుష్’, ‘రాధే శ్యామ్’ కూడా వేర్వేరు ఓటిటిల్లో హాట్ ప్రాపర్టీ అయి ఉండటంతో, నెట్‌ఫ్లిక్స్ తీసుకుంటుందనే టాక్‌ వైరల్ అయ్యింది. అయితే ఇప్పుడు తాజా సమాచారం ప్రకారం, ‘ది రాజా సాబ్’ ఓటిటి రేస్‌ని జియో–హాట్‌స్టార్ దక్కించుకుందట. అన్ని భాషలతో కలిపి ఓటిటి హక్కుల కోసం జియో–హాట్‌స్టార్ దాదాపు రూ. 170 కోట్లకు పైగా ఆఫర్ చేసినట్లు సమాచారం. ఒకవేళ ఈ వార్త నిజమైతే కనుక ‘ది రాజా సాబ్’ ఓటీటీ రికార్డుల్లో కూడా టాప్ లిస్టులో చేరినటే. దీని గురించి అధికారికంగా ప్రకటన రావాల్సి ఉంది.

Exit mobile version