Site icon NTV Telugu

Game On : ఓటీటీలోకి వచ్చేసిన సైకలాజికల్ థ్రిల్లర్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..?

Whatsapp Image 2024 02 27 At 9.22.52 Pm

Whatsapp Image 2024 02 27 At 9.22.52 Pm

సైకలాజికల్ థ్రిల్లర్ మూవీగా తెరకెక్కిన ‘గేమ్ ఆన్’ మూవీ ఫిబ్రవరి 2వ తేదీన థియేటర్లలో రిలీజ్ అయి పాజిటివ్ టాక్ తెచ్చుకుంది.ఈ చిత్రంలోగీతానంద్, నేహా సోలంకీ హీరో హీరోయిన్లుగా నటించారు..ప్రేక్షకుల నుంచి పాజిటివ్ టాక్ వచ్చినా కూడా కమర్షియల్ సక్సెస్ సాధించలేకపోయింది.ఇదిలా ఉంటే ఈ ‘గేమ్ ఆన్’ సినిమా సడెన్‍గా ఓటీటీలోకి వచ్చేసింది.గేమ్ ఆన్ మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో నేడు స్ట్రీమింగ్‍కు వచ్చేసింది. ముందస్తు ప్రకటనలు లేకుండా హఠాత్తుగా ఈ చిత్రం ఓటీటీలోకి ఎంట్రీ ఇచ్చింది.. ఫోన్ కాల్ ద్వారా ఓ రియల్ టైమ్ గేమ్ ఆడడం చుట్టూ ఈ థ్రిల్లర్ మూవీ కథ తిరుగుతుంది.థియేటర్లలో రిలీజై నెల రోజులు ముగియకుండానే అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో గేమ్ ఆన్ చిత్రం స్ట్రీమింగ్‍కు అందుబాటులోకి వచ్చింది.గేమ్ ఆన్ చిత్రానికి దయానంద్ దర్శకత్వం వహించారు. గీతానంద్, నేహా సోలంకి ప్రధాన పాత్రలు చేయగా.. మధూ, శుభలేఖ సుధాకర్, ఆదిత్య మీనన్, కిరీటి మరియు వాసంతి కృష్ణ ముఖ్య పాత్రలు చేశారు.

ఈ చిత్రానికి అభిషేక్ ఏఆర్ సంగీతం అందించగా వంశీ అట్లూరి ఎడిటింగ్ చేశారు. రవి కస్తూరి నిర్మించిన ఈ మూవీకి అరవింద్ విశ్వనాథన్ సినిమాటోగ్రఫీ చేశారు.ఫోన్ కాల్స్ ద్వారా వచ్చిన టాస్కులు చేస్తూ సాగే యువకుడికి ఎదురైన సవాళ్లు మరియు పరిస్థితులు గేమ్ ఆన్ మూవీలో ప్రధానంగా ఉంటాయి. సిద్ధార్థ్ (గీతానంద్) ఓ గేమింగ్ కంపెనీలో పని చేస్తుంటాడు. అయితే, అతడి మంచి తనాన్ని స్నేహితులు వాడుకుంటారు. లవ్ కూడా బ్రేకప్ అవుతుంది. ఉద్యోగాన్ని కూడా అతడు పోగొట్టుకుంటాడు. దీంతో ఆత్మహత్య చేసుకోవాలని సిద్ధార్థ్ నిర్ణయించుకుంటాడు. ఆ తరుణంలో అతడికి ఓ ఫోన్ కాల్ వస్తుంది. తాను చెప్పిన టాస్కులు చేస్తూ ఉంటే డబ్బులు పంపిస్తామని ఆ కాల్‍లో వ్యక్తి చెబుతారు. ఆరంభంలో సులువైన టాస్కులు ఇస్తుండటంతో సిద్ధార్థ్ చేస్తుంటాడు. ఈ క్రమంలో తార (నేహా సోలంకి)తో అతడు ప్రేమలో పడతాడు. అయితే, ఆ తర్వాత ఓ దశలో ఓ వ్యక్తిని మర్డర్ చేయాలని సిద్ధార్థ్‌కు టాస్క్ వస్తుంది. ఆ తర్వాత ఏం జరిగింది..ఈ గేమ్ వెనుక ఎవరు ఉన్నారు..? సిద్ధార్థ్‌తో ఎందుకు ఈ మర్డర్ చేయించాలనుకుంటున్నారు..? అనేదే గేమ్ ఆన్ సినిమాలో ప్రధాన కథగా వుంది..

Exit mobile version