Site icon NTV Telugu

Urvashi Rautela : ఆ డ్రస్సు 20లక్షలా.. ఏముందమ్మ అందులో

New Project (5)

New Project (5)

Urvashi Rautela : బాలీవుడ్‌ నటి ఊర్వశి రౌతేలా మెగాస్టార్‌ చిరంజీవి వాల్తేరు వీరయ్యతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది. తాజాగా అఖిల్ ఏజెంట్‌ మూవీలో ఓ ప్రత్యేక సాంగ్‌లో ఆమె కనిపించింది. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో అనిల్ సుంకర ఈ చిత్రాన్న నిర్మించారు. వైల్డ్ సాలా అంటూ సాగిన ఆ పాటకు మంచి రెస్పాన్స్ దక్కింది. అఖిల్ – ఊర్వశిల డ్యాన్స్ కు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. మాస్ ఆడియన్స్ తో పాటు అన్ని వర్గాల వారిని కూడా మెప్పించే విధంగా ఈ సాంగ్ నిలిచింది. ఆ ఐటం సాంగ్ లో ముద్దుగుమ్మ ఊర్వశి రౌతేలా ధరించిన డ్రెస్ గురించి ప్రస్తుతం ఆసక్తికర చర్చ సోషల్ మీడియాలో జరుగుతోంది.

Read Also: Viral poster: సెలవు తీసుకున్న డ్రైవర్‌.. పోస్టర్లు వేసిన యజమాని

ఏజెంట్ యూనిట్ ఊర్వశి కోసం ఆ డ్రస్ ను ప్రత్యేకంగా డిజైన్ చేయించారట. న్యూయార్క్ రెట్రో ఫ్రెట్ బ్రాండ్ లో ఊర్వశి లుక్ చూసిన ప్రతి ఒక్కరు ఫిదా అయ్యారు. ఐటం సాంగ్ లో ఆమె ఔట్ ఫిట్ గురించి ప్రత్యేకంగా చర్చ జరిగింది. మరి అంతటి స్పెషల్ కాస్ట్యూమ్ కి ఏకంగా రూ.20 లక్షలు ఖర్చు చేసినట్టు తెలుస్తోంది. సినిమాలో అఖిల్ కు జోడీగా సాక్షి వైద్య నటించింది. సాక్షి వైద్య పాత్ర కు ఎంత ప్రాముఖ్యత దక్కిందో అదే స్థాయిలో ఊర్వశి రౌతేలా స్పెషల్ సాంగ్ కు ప్రాముఖ్యత దక్కిందని అర్థం అవుతోంది.

Read Also:AP Amaravti Jac : జీపీఎఫ్‌పై వడ్డీ ఆర్ధిక శాఖ కార్యదర్శి జీతం నుంచి చెల్లించాలి

Exit mobile version