అతనో గంజాయి స్మగ్లర్.. ఓ బైకిస్ట్ ను లిఫ్ట్ అడిగాడు.. ఇంతలో పోలీసులు తనిఖీలు చేస్తుండటం చూసి, బైక్ దిగి పరుగులు పెట్టాడు. అనుమానం వచ్చిన పోలీసులు వెంబడించి పట్టుకున్నారు. వివరాల్లోకి వెళ్తే.. ఉత్తరాఖండ్లో గంజాయి స్మగ్లింగ్ బ్లాక్ వ్యాపారాన్ని పోలీసులు గుట్టురట్టు చేశారు. మంగోలి ప్రాంతంలో 31.99 గ్రాముల గంజాయి తరలిస్తున్న బరేలీకి చెందిన స్మగ్లర్‌ను పోలీసులు అరెస్టు చేశారు.
Read Also: Cm Revanth Reddy: పారిశ్రామిక అభివృద్ధిలో ప్రపంచంతో పోటీ పడాలి
అతనిపై పోలీసులు ఎన్‌డిపిఎస్ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి జైలుకు పంపారు. నిందితుడు బరేలీకి చెందిన పెద్ద గంజాయి స్మగ్లర్ అని తెలిపారు. గతంలో కూడా గంజాయిని నైనిటాల్ కు పంపించనట్లు పోలీసులు పేర్కొన్నారు. సోమవారం ఉదయం.. మంగోలి ఔట్‌పోస్ట్ ఇంచార్జి భూపేంద్ర సింగ్ మెహతా పోలీసు సిబ్బందితో కలిసి ఆ ప్రాంతంలో తనిఖీలు చేస్తున్నారు. అదే సమయంలో కలదుంగి నుంచి బైక్ లిఫ్ట్ అడుక్కుని వస్తున్న స్మగ్లర్ పోలీసులను చూసి కిందకు దిగి పారిపోయాడు.
Read Also: Karate Kalyani : చేసిందే తప్పుడు పని.. హేమ భర్తను లాగుతూ కరాటే కళ్యాణి షాకింగ్ కామెంట్స్
కాగా.. పోలీసులు బైకిస్ట్ ను ఆపి విచారించగా.. అతను లిఫ్ట్ అడిగితే ఎక్కించుకున్నట్లు చెప్పాడు. అనంతరం పారిపోతున్న స్మగ్లర్ ను పోలీసులు వెంబడించి పట్టుకున్నారు. అతని నుండి గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఈ క్రమంలో.. అతన్ని పోలీసులు విచారించగా గంజాయి తరలించేందుకు బరేలీ నుండి నైనిటాల్ వెళ్తున్నట్లు చెప్పాడు. కాగా.. పోలీసులు నిందితుడిని కోర్టులో హాజరుపరిచి జ్యుడీషియల్ కస్టడీకి తరలించారు.