Site icon NTV Telugu

Mohan Babu: మీడియా ప్రతినిధులపై బౌన్సర్ల దాడి.. పోలీసు శాఖ సీరియస్..

Mohan Babu

Mohan Babu

హైదరాబాద్ జల్పల్లిలోని మోహన్ బాబు నివాసం వద్ద మంగళవారం రాత్రి ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. అక్కడున్న బౌన్సర్లు మీడియా ప్రతినిధులపై దాడి చేశారు. ఈ ఘటనపై పోలీస్ శాఖ సీరియస్ అయ్యింది. మోహన్ బాబు చుట్టూ ఉన్న బౌన్సర్లను బైండోవర్ చేయాలని తెలంగాణ పోలీస్ శాఖ ఆదేశాలు జారీ చేసింది. బౌన్సర్ల తో పాటు మోహన్ బాబు, విష్ణు దగ్గర ఉన్న గన్లను డిపాజిట్ చేయాలని ఆదేశించింది. రేపు ఉదయం 10:30 గంటలకు వ్యక్తిగతంగా విచారణకు హాజరు కావాలని మోహన్‌బాబుకు పోలీసు శాఖ సూచించింది.

READ MORE: Syria: సిరియా నుంచి ఇండియాకు బయల్దేరిన భారతీయ పౌరులు.. ప్రస్తుతం ఎక్కడున్నారంటే?

కాగా..నిన్న (మంగళవారం) సాయంత్రం పోలీస్ అధికారులతో కలిసి మంచు మనోజ్ దంపతులు మోహన్‌బాబు నివాసం నుంచి బయటకు వెళ్లారు. అనంతరం డీజీపీ ఆఫీస్‌లో అడిషనల్ డీజీపీతో భేటీ అయ్యారు. తర్వాత తిరిగి ఆ నివాసానికి వెళితే గేట్లు ఓపెన్ చేయకుండా సెక్యూరిటీ సిబ్బంది కాసేపు ఇబ్బంది పెట్టారు. చాలాసేపు గేటు బయట కారులో ఉండిపోయిన మనోజ్ దంపతులు ఎంతకీ గేటు ఓపెన్ చేయకపోవడంతో కారు దిగి సెక్యూరిటీ సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. తమ 7 నెలల పాప లోపలే ఉందని మౌనిక ఆందోళన వ్యక్తం చేసిన క్రమంలో మంచు మనోజ్ తన బౌన్సర్లతో గేట్లను బద్దలు కొట్టుకుంటూ లోపలికి వెళ్లే ప్రయత్నం చేశారు.

READ MORE:Collectors Conference: నేడు, రేపు కలెక్టర్ల సదస్సు.. సీఎం చంద్రబాబు అధ్యక్షతన భేటీ

అయితే అప్పటికే అక్కడికి చేరుకున్న పోలీసులు ఇరుపక్షాల బౌన్సర్లను బయటకు పంపే ప్రయత్నం చేశారు. పూర్తిగా మోహన్ బాబు నివాసాన్ని పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇదిలా జరుగుతుండగా మీడియా ప్రతినిధులపై మోహన్ బాబు సమక్షంలోనే బౌన్సర్లు దాడికి దిగారు. మోహన్ బాబు ఏర్పాటు చేసుకొన్న బౌన్సర్లు మీడియా ప్రతినిధులపై కర్రలతో దాడి చేశారు. దీంతో ఆయా నివాసం వద్ద తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ ఘటనపై తాజాగా స్పందించిన రాష్ట్ర పోలీసు శాఖ సీరియస్ అయ్యింది.

Exit mobile version