NTV Telugu Site icon

WTC FINAL : ఐపీఎల్ లో మెరిసిన ప్లేయర్స్.. ఓవల్ లో ఏం చేస్తారో మరీ..!

Wtc

Wtc

ఐపీఎల్ పాల్గొన్న భారత క్రికెటర్లు.. వచ్చే నెల 7 నుంచి 11 వరకూ ‘ది ఓవల్’ వేదికగా ఆస్ట్రేలియాతో ఆసీస్ తో జరుగబోయే వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ కు ముందు మంచి మ్యాచ్ ప్రాక్టీస్ దొరికింది. భారత స్టార్ ఆటగాళ్లు విరాట్ కోహ్లీ, శుభ్‌మన్ గిల్ లు ఈ సీజన్ లో పరుగుల వరద పారించారు. గిల్.. 16 మ్యాచ్ లు ఆడి 16 ఇన్నింగ్స్ లో 60కి పైగా స్ట్రైక్ రేట్ తో 851 పరుగులు చేశాడు. ఈ సంవత్సరం వన్డేలు, టీ20లు, టెస్టులలో చేసిన సెంచరీలను ఐపీఎల్ లో కూడా కంటిన్యూ చేశాడు. గిల్ భీకర ఫామ్ లో మూడు సెంచరీలు చేశాడు.

Also Read : Iqbal Chapter Removed: ‘ఇక్బాల్’ చాప్టర్‌ను తొలగించిన ఢిల్లీ యూనివర్సిటీ..!

మరోవైపు గతేడాది ఆగస్టులో ఆసియా కప్ టోర్నీలో ఫామ్ లోకి వచ్చిన కోహ్లీ.. ఈ ఏడాది ఆరంభంలో న్యూజిలాండ్, శ్రీలంకతో పాటు ఆస్ట్రేలియాతో అహ్మదాబాద్ టెస్టులో శతకం కొట్టాడు. ఐపీఎల్ లో కోహ్లీ 14 మ్యాచ్ లు ఆడి 56 సగటుతో 639 రన్స్ చేశాడు. కోహ్లీ కూడా రెండు బ్యాక్ టు బ్యాక్ సెంచరీలతో మంచి జోరుమీద కనిపిస్తున్నాడు.
కోహ్లీ-గిల్ లు మాత్రమే కాదు.. ఇంగ్లాండ్ లోనే కౌంటీ ఛాంపియన్షిప్ ఆడుతున్న నయా వాల్ ఛతేశ్వర్ పుజారా కూడా ఈ సీజన్ లో సెంచరీలు బాదుతున్నాడు. ససెక్స్ టీమ్ తరఫున ఆడుతున్న పుజారా మూడు సెంచరీలు కొట్టాడు.

Also Read : NATO : మోదీ అమెరికాకు వెళ్లకముందే.. భారత్‎ను నాటో ప్లస్‎లో చేర్చాలని డిమాండ్

ఇటు బ్యాటింగ్ తో పాటు అటు బౌలింగ్ లో కూడా భారత్ కు సానుకూలాంశాలు చాలానే ఉన్నాయి. ఐపీఎల్ లో అత్యధిక వికెట్లు తీసిన వారిలో టీమిండియా పేసర్ మహ్మద్ షమీ.. 28 వికెట్లు తీసి పర్పుల్ క్యాప్ హోల్డర్ గా ఉన్నాడు. మరో భారత స్టార్ పేసర్ మహ్మద్ సిరాజ్ కూడా 19 వికెట్లు తీసి మంచి ఊపుమీద కనిపిస్తున్నాడు. స్పిన్నర్ రవీంద్ర జడేజా 15 మ్యాచ్ లలో 19 వికెట్లు పడగొట్టి జోరుమీద కనబడుతున్నాడు. అశ్విన్ 13 మ్యాచ్ లలో 14 వికెట్లు పడగొట్టాడు. డబ్ల్యూటీసీ ఫైనల్స్ లో టీమిండియా ప్రధాన బౌలింగ్ యూనిట్ అంతా ఐపీఎల్ లో అదరగొట్టే ప్రదర్శనలు చేసింది.

Also Read : Prithvi Shah: లవర్ తో ఎంజాయ్ చేస్తున్న యంగ్ క్రికెటర్

మరి ఈ సెంచరీ మొనగాళ్లు, వికెట్ల వీరులు డబ్ల్యూటీసీ ఫైనల్స్ లో ఇదే ఫామ్ ను కొనసాగిస్తారా..? అనేది ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. డబ్ల్యూటీసీ ఫైనల్స్ జరిగే ది ఓవల్ గ్రౌండ్ బంతితో పాటు బ్యాటింగ్ కు కూడా అనుకూలంగా ఉంటుంది. ఇది టీమిండియాకు కాస్త సానుకూలాంశమే. కానీ ఓవల్ లో టీమిండియాకు చెత్త రికార్డు ఉంది. ఈ గ్రౌండ్ లో ఇంతవరకూ 14 టెస్టులు ఆడిన భారత జట్టు రెండింటిలో గెలిచి ఐదు మ్యాచ్ ల్లో ఓడింది. ఏడు టెస్టులు డ్రా అయ్యాయి. ఐపీఎల్ లో రాణించి ఐసీసీ ట్రోఫీలలో విఫలమవడం భారత ఆటగాళ్లకు ఆనవాయితీగా వస్తుంది. అయితే ఆస్ట్రేలియాకు కూడా ఓవల్ లో గొప్ప రికార్డ్ ఏమి లేదు. ఇక్కడ 38 టెస్టులు ఆడిన ఆసీస్.. ఏడు గెలిచి 17 మ్యాచ్ లు ఓడి.. 14 టెస్టులు డ్రా అయ్యాయి.