NTV Telugu Site icon

LIC Jeevan Labh Scheme : రోజూ రూ. 253 ఆదా చేస్తే.. రూ. 54 లక్షలు పొందవచ్చు.. అద్భుతమైన పథకం!

Lic Jeevan Labh Scheme

Lic Jeevan Labh Scheme

LIC Jeevan Labh Scheme : ప్రభుత్వ ఆధీనంలో ఉన్న అతిపెద్ద బీమా కంపెనీ ఎల్‌ఐసీ, జీవిత రక్షణ బీమాతో పాటు ఉత్తమ రాబడిని అందిస్తుంది. దేశంలోని అతిపెద్ద ప్రభుత్వ బీమా కంపెనీ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (LIC) అనేక పథకాల్లో మిలియన్ల మంది పౌరులు ఇప్పటి దాకా పెట్టుబడి పెట్టారు. ప్రతి వయస్సు వారికి ఏదో ఒక పథకాన్ని ఎల్‌ఐసి అందజేస్తుంది. దీర్ఘకాలిక పెట్టుబడి తర్వాత పెద్ద నిధులను కూడగట్టుకోవాలనుకుంటే, LIC వారి ఈ పాలసీ సాయపడుతుంది. ఈ పథకం స్టాక్ మార్కెట్‌తో అనుసంధానించబడినది కూడా.

Read Also:IND VS AUS : నేటి నుంచే విశాఖ వన్డే టికెట్లు అమ్మకం

ఈ పథకం పేరు ఎల్‌ఐసీ జీవన్ లాభ్(LIC Jeevan Labh Scheme). ఈ నాన్-లింక్డ్ పాలసీ మెచ్యూరిటీ తర్వాత బీమా చేసిన వ్యక్తికి ఏకమొత్తంలో ప్రయోజనాన్ని అందిస్తుంది. రోజూ రూ. 253 ఆదా చేసుకుంటే.. మెచ్యూరిటీ సమయంలో రూ. 54 లక్షలు పొందవచ్చు. LIC యొక్క ఈ పథకం స్టాక్ మార్కెట్‌పై ఆధారపడనందున సురక్షితమని నిపుణులు సూచిస్తున్నారు. బీమా చేసిన వ్యక్తి మరణిస్తే, అతని వారసులు పరిహారం మొత్తాన్ని పొందుతారు. కాబట్టి పెట్టుబడి పెట్టాలని ప్లాన్ చేస్తున్నట్లయితే, ఈ ప్లాన్ మీకు ఖచ్చితంగా సరిపోయే ప్లాన్. ప్రతిరోజూ కేవలం రూ. 253 ఆదా చేయడం ద్వారా, రాబోయే 25 ఏళ్లలో రూ. 54 లక్షల నిధిని కూడగట్టుకోవచ్చు. బీమా ప్రయోజనాలను కూడా పొందవచ్చు.

Read Also: Couple In Bathroom: హోలీ ఆడి బాత్ రూం కెళ్లారు… డెడ్ బాడీలుగా తిరిగివచ్చారు

రోజుకు రూ.253 ఆదా చేస్తే నెలాఖరులో రూ.7,700 ఆదా అవుతుంది. కాబట్టి సంవత్సరానికి దాదాపు రూ. 92,400 ప్రీమియం చెల్లిస్తారు. దీర్ఘకాలిక పెట్టుబడులలో మొత్తం రూ. 20 లక్షలు పెట్టుబడి పెడతారు. ఈ పెట్టుబడి నుండి రూ. 54 లక్షల రాబడిని పొందుతారు. చాలా మంది ఉత్సాహంగా ఎల్‌ఐసీ బీమా పాలసీని ప్రారంభిస్తారు. కానీ వాటిని కొనసాగించడం కష్టం. ఆ సందర్భంలో పాలసీ మూసివేయబడుతుంది. ఈ లాప్స్ పాలసీని పునఃప్రారంభించవచ్చు. ఎల్‌ఐసీ ఇప్పుడు దీనికి సదుపాయం కల్పించింది. మీరు క్లోజ్డ్ పాలసీని ప్రారంభించవచ్చు. అయితే దానికి నిర్ణీత వ్యవధిని నిర్ణయించారు. LIC ల్యాప్ అయిన, నిలిపివేసిన పాలసీని రీలాంచ్ చేయడానికి ఒక డ్రైవ్‌ను ప్రారంభించింది.

Show comments