NTV Telugu Site icon

Murder: జీతం వివాదంలో దారుణంగా హత్య చేసిన యజమాని.. కాన్పూర్ లో ఘటన

Murder

Murder

Murder: దేశ వ్యాప్తంగా హత్యలు రోజు రోజుకు పెరిగిపోతూనే ఉన్నాయి. చిన్న చిన్న వివాదాలకు కూడా ప్రాణాలు తీస్తున్నారు హంతకులు. ఎన్ని చట్టాలొచ్చినా.. మానవ మృగాలల్లో చలనం లేకుండా పోతుంది. తాజాగా కాన్పూర్ లో గుట్కా ఫ్యాక్టరీ యజమాని ఒకరి ప్రాణాలను తీశాడు. ఫ్యాక్టరీలో పనిచేస్తున్న ఓ వ్యక్తిని దారుణంగా హతమార్చాడు. అతనికి ఇవ్వాల్సిన జీతం వివాదంలో కడతేర్చాడు. అతనికి రావల్సిన జీతం అడిగినందుకు.. యజమానితో గొడవ పడ్డాడు. ఆ తర్వాత హత్య చేశారు. ఈ ఘటనపై గుట్కా ఫ్యాక్టరీ యజమాని, మరో ముగ్గురిపై పోలీసులు కేసు నమోదు చేశారు.

Read Also: Somu Veerraju: చంద్రబాబు, లోకేష్‌పై సోము వీర్రాజు ఫైర్.. అలా ఎలా హామీలిస్తున్నారు?

జీతం ఇవ్వలేదనే కారణంతోనే తన కుమారుడిని హత్య చేశారని మృతుడి తండ్రి ఆరోపించారు. తన 22 ఏళ్ల కుమారుడు దాదా నగర్‌లోని ఎస్‌ఎన్‌కె లైన్ గుట్కా ఫ్యాక్టరీలో గత ఏడాది కాలంగా పనిచేస్తున్నట్లు తెలిపారు. నెలకు రూ.15,000 జీతానికి పనిచేస్తున్నాడని.. ఆ జీతం విషయంలోనే వాగ్వాదం తలెత్తి హత్యకు దారితీసినట్లు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అంతేకాకుండా ఫ్యాక్టరీ యజమాని, కాంట్రాక్టర్ తన కుమారుడికి ఆరు నెలలుగా జీతం ఇవ్వలేదని ఆరోపించారు. తన కొడుకు తనకు రావాల్సిన డబ్బు అడిగినప్పుడల్లా వాయిదా వేసేవారు అని తండ్రి సీతారాం చెప్పారు.

Read Also: Murder: జీతం వివాదంలో దారుణంగా హత్య చేసిన యజమాని.. కాన్పూర్ లో ఘటన

జూన్ 7న యజమాని, కాంట్రాక్టర్ తో సహా మరో ఇద్దరు తన కొడుకుకు మద్యం తాగించారని తెలిపాడు. అనంతరం కట్టివేసి తీవ్రంగా కొట్టి.. ఫ్యాక్టరీలోని మూడవ అంతస్తు నుండి త్రోసివేసి చంపేశారని మృతుడి తండ్రి ఆరోపించాడు. జీతాల వివాదంతో మృతుడి కుటుంబీకులు హత్య చేశారని ఆరోపించగా.., ఎస్‌ఎన్‌కె గుట్కా ఫ్యాక్టరీ యాజమాన్యం మాత్రం బిల్డింగ్ పై నుండి పడి మరణించాడని తెలిపాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Show comments