NTV Telugu Site icon

Hyderabad: దారుణం.. ఇంటి అద్దె కట్టలేదని యువతిపై కత్తితో దాడి

Knife Attack

Knife Attack

హైదరాబాద్‌లో దారుణం చోటుచేసుకుంది. ఇంటి అద్దె కట్టలేదని యజమాని ఓ యువతిపై కత్తితో దాడికి దిగాడు. ఈ ఘటన అత్తాపూర్ హసన్ నగర్ లో చోటుచేసుకుంది. కొద్ది నెలలుగా ఇంటి అద్దె కట్టకపోవడంతో యువతి పై కత్తితో దాడి చేయగా.. ఆమె చేతికి, తలకు కత్తి గాయాలయ్యాయి. గాయాల పాలైన యువతిని ఆస్పత్రికి తరలించారు.

READ MORE: AP Assembly Sessions 2024: నేటి నుంచి ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు.. పద్దు ప్రవేశపెట్టనున్న ప్రభుత్వం

అసలేం జరిగిందంటే..
అత్తాపూర్ హసన్ నగర్ లో ఓ ఇంటి యజమాని అద్దె చెల్లించకపోవడంతో కరెంట్ కట్ చేశాడు. అద్దెకు ఉంటున్న కుటుంబానికి, యజమానికి మధ్య గొడవ జరిగింది. ఆగ్రహానికి లోనైన యజమాని ఆ కుటుంబంపై కత్తితో దాడి చేశాడు. దీంతో ఆ కుటుంబంలోని యువతికి గాయాలయ్యాయి. దీంతో బాధితురాలిని ఆస్పత్రికి తరలించిన కుటుంబీకులు స్థానిక పోలీస్ట్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన అత్తాపూర్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

READ MORE:CJI Sanjiv Khanna Oath : సుప్రీంకోర్టు 51వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సంజీవ్ ఖన్నా..నేడే ప్రమాణ స్వీకారం

Show comments