Site icon NTV Telugu

The Nun 2 : ఓటీటీలోకి వచ్చేసిన హాలీవుడ్ హారర్ మూవీ.. తెలుగు స్ట్రీమింగ్ ఎక్కడంటే..?

Whatsapp Image 2024 02 09 At 9.38.32 Am

Whatsapp Image 2024 02 09 At 9.38.32 Am

ప్రముఖ హాలీవుడ్ సంస్థ వార్నర్ బ్రదర్స్ ప్రొడక్షన్ బ్యానర్‌ నుంచి అనేక హారర్ సినిమాలు వచ్చాయి. వాటిలో ది కంజూరింగ్, అనాబెల్లె, ఈవిల్ డెడ్ మరియు లైట్స్ అవుట్ వంటి ఫ్రాంచైజీస్‌కి ఫుల్ క్రేజ్ వచ్చింది. ఈ సంస్థ నుంచి 2018లో వచ్చి హాలీవుడ్‌తోపాటు తెలుగు ప్రేక్షకులను భయపెట్టిన సినిమానే ది నన్. ఈ సినిమా ప్రేక్షకులకు వెన్నులో వణుకు పుట్టించింది.అలాంటి ది నన్ సినిమా ప్రపంచవ్యాప్తంగా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టడమే కాకుండా బాక్సాఫీస్ వద్ద వసూళ్ల సునామీ సృష్టించింది. అయితే అలాంటి మూవీకి సీక్వెల్‌గా”ది నన్ 2” మూవీ వచ్చింది.. సుమారు ఐదేళ్ల తర్వాత వచ్చిన ది నన్ 2 చిత్రాన్ని జేమ్స్ వాన్, పీటర్ సాఫ్రన్ మరియు జుడ్సన్ స్కాట్ సంయుక్తంగా నిర్మించారు. దీనికి మైఖేల్ చేవ్స్ దర్శకత్వం వహించారు. ది నన్ 2 హారర్ చిత్రంలో సిస్టర్ ఇరేనే అనే మెయిన్ లీడ్ రోల్‌లో టైస్సా ఫార్మి నటించింది.గతేడాది సెప్టెంబర్ 8న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలైన ది నన్ 2 భారీగా కలెక్షన్స్ కొల్లగొట్టింది.269.5 మిలియన్ డాలర్స్ కలెక్షన్స్ వసూలు చేసి హిట్ టాక్ తెచ్చుకుంది. దేవత లాంటి ఓ యువతి దెయ్యంగా ఎలా మారింది వంటి కథాంశంతో ది నన్ 2 తెరకెక్కింది. స్టోరీ, స్క్రీన్ ప్లే మరియు హారర్ స్పెషల్ ఎఫెక్ట్స్ తో ప్రేక్షకులను సీట్ ఎడ్జ్‌లో కూర్చోబెట్టింది ఈ సినిమా. అలాంటి మూవీ ది నన్ 2 ఓటీటీలోకి వచ్చేసింది.

అయితే ఇప్పటికే ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియో మరియు బుక్ మై షోలో ది నన్ 2 స్ట్రీమింగ్ అవుతోంది.అమెజాన్ ప్రైమ్ వేదికగా గతేడాది అక్టోబర్ 19 నుంచి ది నన్ 2 మూవీ రెంటల్ విధానంలో ఇంగ్లీష్‌తోపాటు తెలుగు, హిందీ మరియు తమిళ భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది. రూ. 149 చెల్లించి పే పర్ వ్యూ పద్ధతిలో అమెజాన్ ప్రైమ్‌లో ది నన్ 2 చిత్రాన్ని వీక్షించే సదుపాయం కల్పించారు. అలాగే బుక్ మై షో ఓటీటీలో ది నన్ 2 సినిమాను రూ. 149కి రెంటల్ విధానంలో చూసే వీలు కల్పించగా.. రూ. 699కి కొనుక్కోవచ్చు. అంటే పే పర్ వ్యూ (రెంటల్ విధానం) పద్ధతిలో అయితే ఒక్కసారి డబ్బు చెల్లించాకా 48 గంటల సమయం వరకు చూసే అవకాశం మాత్రమే ఉంటుంది.అదే రూ. 699 చెల్లించి ది నన్ 2ని కొనుక్కుంటే తెలుగు, హిందీ, ఇంగ్లీషు మరియు తమిళ భాషల్లో ఎప్పుడైనా వీక్షించవచ్చు. అయితే, ఇప్పుడు ఇలాంటి రెంటల్ విధానం లేకుండా చూసేందుకు మరో ఓటీటీలో ది నన్ 2 వచ్చేసింది. జియో సినిమా ఓటీటీలో ది నన్ 2 తెలుగు మరియు హిందీ భాషలో ఫిబ్రవరి 7 నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. కానీ, అందుకు జియో సినిమా సబ్ స్క్రిప్షన్ మాత్రం తీసుకోవాలి. సాధారణంగా జియో సినిమాలను ఎలాంటి సబ్ స్క్రిప్షన్ లేకుండా ఫ్రీగా చూసేయొచ్చు. కానీ, హాలీవుడ్ చిత్రాలను మాత్రం సబ్ స్క్రిప్షన్ ద్వారా మాత్రమే చూడగలం.దీనితో ఈ బ్లాక్ బస్టర్ హారర్ మూవీని ఏకంగా మూడు ఓటీటీల్లో చూడవచ్చు.

Exit mobile version