‘సిగరెట్ తాగడం ఆరోగ్యానికి హానికరం…’ అని సిగరెట్ ప్యాకెట్లపై చట్టబద్ధమైన హెచ్చరిక రాసి ఉన్నా యువతలో వ్యసనం పెరిగిపోతోంది. గత దశాబ్ద కాలంలో భారతదేశంలో సిగరెట్లు, బీడీలు తాగే లోపు వయసున్న యువత సంఖ్య పెరిగిందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ కొత్త నివేదిక వెల్లడించింది. ‘భారత్‌లో పొగాకు నియంత్రణ 2022’ పేరుతో రూపొందించిన ఈ నివేదికలో దేశవ్యాప్తంగా పొగాకు వినియోగించే వారి సంఖ్య తగ్గుముఖం పట్టిందని.. అయితే సిగరెట్లు లేదా బీడీల వినియోగం పెరిగిందని తెలిపింది. ఆందోళనకరమైన విషయమేమిటంటే ప్రస్తుతం యువతులలో సిగరెట్లు, బీడీలు తాగే అలవాటు వేగంగా పెరుగుతోంది. 2009 నుంచి 2019 మధ్య అంటే 10 ఏళ్లలో స్మోకింగ్ చేసే అమ్మాయిల సంఖ్య రెండింతలు పెరిగిందని ఈ నివేదిక తెలియజేస్తోంది. ధూమపానం చేసే అబ్బాయిల సంఖ్య కూడా పెరిగింది.. కానీ అంతగా లేదు.
READ MORE: Naga Chaitanya: తండేల్ కోసం తొమ్మిది నెలలు.. సీక్రెట్స్ బయటపెట్టిన చైతూ
ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఇటీవల విడుదల చేసిన ఈ నివేదికలో.. 2009లో దేశంలో 2.4% మంది అమ్మాయిలు ధూమపానం చేశారని పేర్కొంది. కాగా, 2019లో అది 6.2 శాతానికి పెరిగింది. అంటే ఈ 10 ఏళ్లలో స్మోకింగ్ చేసే అమ్మాయిల సంఖ్య 3.8% పెరిగింది. అదేవిధంగా 2009లో 5.8% మంది అబ్బాయిలు ధూమపానం చేశారు. 2019లో వారి సంఖ్య 8.1 శాతానికి పెరిగింది. అంటే, 10 సంవత్సరాలలో ధూమపానం చేసే అబ్బాయిల సంఖ్య 2.3% పెరిగింది. ఈ పద్ధతిలో చూస్తే 10 ఏళ్లలో స్మోకింగ్ చేసే అబ్బాయిల సంఖ్య అమ్మాయిల కంటే పెద్దగా పెరగలేదు. ఈ నివేదికలో ఆందోళనను పెంచే మరో అంశం కూడా ఉంది. కొత్త తరం మరింత వేగంగా ధూమపానానికి అలవాటు పడుతున్నట్లు ఈ నివేదిక తెలియజేస్తోంది. నివేదిక ప్రకారం.. 2017లో 1.5% వయోజన మహిళలు ధూమపానం చేశారు. కాగా 2019లో 6.2% మంది అమ్మాయిలు ధూమపానం చేస్తున్నట్లు గుర్తించారు. దీన్నిబట్టి రాబోయే తరం స్మోకింగ్‌కు బానిసలుగా మారుతున్నట్లు తెలుస్తోంది.