పెళ్లి జీవితంలో ఒక్కసారి జరుపుకొనే వేడుక.. పెళ్లి అనగానే అమ్మాయిలు, అబ్బాయిలు ఊహల్లో తేలిపోతారు..ఇక ఎవరి స్థోమతను బట్టి వాళ్లు ఘనంగా చేసుకుంటారు. ఆకాశమంత పందిరి.. అంటూ వివాహం ఎంత ఘనంగా జరుపుకున్నారో చెప్పుకోవడానికి అతిశయోక్తులు కూడా ఉన్నాయి. ఇక కొంత మంది కమ్యూనిస్టు వివాహాలు చేసుకుంటారు. ఆడంబరంగా ఖర్చు లేకుండా స్టేజి పెళ్లిళ్లు చేసుకుంటారు. కలిసి అన్యోన్యంగా ఉంటామని ప్రతిజ్ణ చేస్తారు.. ఇలాంటి జంటలే అన్యోన్యంగా ఉంటారు.. ఎటువంటి గొడవలు లేకుండా ఉంటారు.. అయితే కొందరు తమ పెళ్లిని రాజకీయాలతో ముడి పెడతారు.. ఓ జంట తమ పెళ్లి అనంతరం పార్టీ కండువాలు మార్చుకున్నారు. అందుకు సంబందించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది..
ఓ జంట మాత్రం తమ వివాహ వేడుకలో వినూత్న పద్ధతిని అనుసరించారు. ఆ కొత్త జంట జనసేన కార్యకర్తలు అవునా కాదో.. తెలియదు. ఇంతకీ ఆ జంట వివాహం ఎప్పుడు ఎక్కడ జరిగిందో తెలియదు కానీ, వారి పెళ్ల ఫొటోలు మాత్రం నెట్టింట తెగ వైరల్ అయిపోయాయి. ఇంతకీ వారు పెళ్లిలో అనుసరించిన వినూత్న పద్ధతి ఏమిటంటే.. జనసేన అధినేత పవన్ కల్యాణ్ మీద అపారమైన అభిమానం ఉన్న ఆ జంట తమ పెళ్లితో దండలతో పాటు జనసేన కండువాలనూ మార్చుకున్నారు.
ఒకరి మెడలో ఒకరు దండలు వేసుకోవడమే కాకుండా జనసేన కండువాలు కూడా కప్పుకున్నారు. దీంతో వీరి పెళ్లి ఫొటోలు నెట్టింట హల్ చల్ చేస్తున్నాయి. అభిమానమంటే ఇదేరా భాయ్ అంటూ నెటిజన్లు కామెంట్ పెడుతున్నారు. జనసేన ప్రచారానికి ఇదో కొత్త దారి అంటూ కొందరు సెటైర్లు వేస్తున్నారు. మొత్తానికి జనసేన కండువాలతో జరిగిన పెళ్లిపై నెటిజన్లు తమదైన శైలిలో ఫన్నీ కామెంట్లు పెడుతున్నారు.
