Site icon NTV Telugu

Vishwambhara Release Date : రాదనుకున్న ‘విశ్వంభర’ రిలీజ్ అవుతోంది..

Vishwambhara

Vishwambhara

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి హీరోగా మల్లిడి వశిష్ట దర్శకత్వంలో తెరకెక్కిన సోషియో ఫాంటసీ చిత్రం ‘విశ్వంభర’. అప్పుడెప్పుడో మొదలు ‘విశ్వంభర’ సినిమాను ఇంకా చెక్కుతునే ఉన్నారు. దీని తర్వాత చిరు చేసిన ‘మన శంకర వరప్రసాద్ గారు’ సినిమా రిలీజైపోయింది, బ్లాక్ బస్టర్ అయిపోయింది. ఈ సినిమా వచ్చి నెలలు గడుస్తున్నా.. ఇంకా విశ్వంభర నుంచి ఎలాంటి అప్డేట్ రావడం లేదు. నిజానికి గతేడాదిలోనే ఈ సినిమా థియేటర్లలోకి రావాల్సింది. కానీ విఎఫ్‌ఎక్స్ కారణంగా వాయిదా పడుతు వస్తోంది. పర్ఫెక్ట్ అవుట్ పుట్ కోసం గట్టిగా వర్క్ చేస్తున్నారు మేకర్స్

Also Read : Pawan Kalyan : పవన్ కళ్యాణ్ ప్రస్తుతానికి ఒక్కటే?

ఇక ఇన్నాళ్లకు ఈ సినిమా విడుదల తేదీపై ఎట్టకేలకు ఒక స్పష్టత వచ్చినట్లు తెలుస్తోంది. తాజా సమాచారం ప్రకారం విశ్వంభర జూలై 10న ప్రపంచవ్యాప్తంగా విడుదలకు రెడీ అవుతోంది. అసలు ఒకానొకదశలో ఈ సినిమా వస్తుందా రాదా అనే డౌట్ కూడా నెలకొంది. ‘బింబిసార’ చిత్రంతో తన సత్తా చాటిన దర్శకుడు వశిష్ట రెండవ సినిమాగా చేసిన విశ్వంభరను భారీ బడ్జెట్ తో తెరకెక్కించారు. యూవీ క్రియేషన్స్ వారు భారీ బడ్జెట్‌తో నిర్మించిన ఈ సినిమా మెగాస్టార్ కెరీర్లోనే హైయెస్ట్ బడ్జెట్ ఖర్చు చేస్తున్నట్టుగా మొదటి నుంచి ప్రచారంలో ఉంది. ఈ సినిమాలో చిరంజీవి సరసన టాలీవుడ్ క్వీన్ త్రిష నటిస్తుండగా ఆషికా రంగనాథ్ కీలక పాత్రలో కనిపించనుంది. ఆస్కార్ విజేత ఎం.ఎం. కీరవాణి సంగీతం అందిస్తుండటం విశేషం. మరి జులై 10న విశ్వంభర వస్తాడా లేదా అనే దానిపై మేకర్స్ నుండి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

Exit mobile version