Suvarna Sundari : ఏడాది తర్వాత ఓటీటీలోకి వచ్చేస్తున్న ‘సువర్ణ సుందరి’ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సీనియర్ హీరోయిన్ జయప్రద, పూర్ణ మరియు సాక్షి చౌదరి ప్రధాన పాత్రలు పోషించిన ‘సువర్ణ సుందరి’ చిత్రం గతేడాది ఫిబ్రవరి 3వ తేదీన థియేటర్లలో విడుదల అయింది.సూపర్ నేచురల్ సోషియో ఫ్యాంటసీ మూవీగా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. వివిధ కాలాల మధ్య ఈ మూవీ స్టోరీ సాగుతుంది. సువర్ణ సుందరి చిత్రానికి సురేంద్ర మాదారపు దర్శకత్వం వహించారు. థియేటర్లలో పెద్దగా వసూళ్లను రాబట్టలేకపోయిన ఈ చిత్రం ఇప్పుడు ఓటీటీలో స్ట్రీమింగ్కు వచ్చింది.థియేటర్లలో రిలీజైన ఏడాది తర్వాత సువర్ణ సుందరి చిత్రం ఓటీటీలోకి అడుగుపెట్టింది. ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీ ప్లాట్ఫామ్లో నేడు స్ట్రీమింగ్కు వచ్చింది. తెలుగులో మాత్రమే ఈ చిత్రం స్ట్రీమ్ అవుతోంది.అయితే, సువర్ణ సుందరి మూవీ అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో రెంటల్ పద్ధతిలో స్ట్రీమింగ్కు వచ్చింది. రూ.79 రెంట్‌తో అడుగుపెట్టింది. అయితే, త్వరలోనే ఈ మూవీ ప్రైమ్ వీడియో సబ్స్క్రైబర్లందరికీ ఉచితంగా స్ట్రీమింగ్కు వచ్చే ఛాన్స్ ఉంది. ఇప్పటికైతే ఆ ఓటీటీలో రెంటల్ పద్ధతిలో అందుబాటులోకి వచ్చింది.
సువర్ణ సుందరి చిత్రంలో సాయికుమార్, రామ్, ఇంద్ర, నాగినీడు మరియు కోట శ్రీనివాసరావు కీలకపాత్రలు పోషించారు. సురేంద్ర మాదారపు దర్శకత్వం వహించిన ఈ మూవీని ఎం.ఎల్.లక్ష్మి నిర్మించారు. సాయి కార్తీక్ సంగీతం అందించారు.త్రినేత్రి విగ్రహం చుట్టూనే సువర్ణ సుందరి కథ తిరుగుతుంది. కొన్ని తరాలుగా ఈ విగ్రహం వల్ల ఎలాంటి పరిణామాలు జరిగాయన్నది ఈ చిత్రంలో చూపిస్తారు. సస్పెన్స్ ఎలిమెంట్లతో పాటు ఈ చిత్రంలో వీఎఫ్ఎక్స్ కూడా ఎక్కువగానే ఉంటుంది.సువర్ణ సుందరి చిత్రంలో పూర్ణ రెండు పాత్రలు చేశారు. ఆమె నటన మెప్పించింది. అలాగే, అలనాటి హీరోయిన్ జయప్రద చాలా కాలం తర్వాత తెలుగు మూవీ చేశారు. దీంతో ఈ చిత్రానికి మంచి హైప్ వచ్చింది. అయితే మోస్తరు టాక్ తెచ్చుకున్న ఈ చిత్రం థియేటర్లలో పెద్దగా ఆకట్టుకోలేదు.
Also Read
- Shai Hope: భారత్‌ను ఎదుర్కోవాలంటే ఆ స్కోర్ సరిపోదు.. ఓటమికి ప్రధాన కారణం ఇదే: వెస్టిండీస్ కెప్టెన్
- Shreyas Iyer: సెంచరీతో శ్రేయాస్ అయ్యర్ వీర విహారం.. వెస్టిండీస్ చిత్తు చిత్తు.. భారత్ ఘన విజయం..
- Wife Kills Husband: ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య.. ఫోన్ చాట్‌తో వెలుగులోకి దారుణం..
- Team India New Captain: బీసీసీఐ సంచలన నిర్ణయం.. భారత మహిళా జట్టుకు కొత్త కెప్టెన్ ప్రకటన..
తాజావార్తలు
-
World Cotton Day: నేల నుంచి నేత వరకు.. తెల్ల బంగారం తెలంగాణ గుండెచప్పుడు..!
-
Shai Hope: భారత్‌ను ఎదుర్కోవాలంటే ఆ స్కోర్ సరిపోదు.. ఓటమికి ప్రధాన కారణం ఇదే: వెస్టిండీస్ కెప్టెన్
-
Earthquake : ఉత్తరాఖండ్‌లో భూకంపం.. ఢిల్లీ-ఎన్సీఆర్ వరకు ప్రకంపనలు!
-
Shreyas Iyer: సెంచరీతో శ్రేయాస్ అయ్యర్ వీర విహారం.. వెస్టిండీస్ చిత్తు చిత్తు.. భారత్ ఘన విజయం..
-
Wife Kills Husband: ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య.. ఫోన్ చాట్‌తో వెలుగులోకి దారుణం..
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!