Site icon NTV Telugu

Vemulawada: దారుణం.. తాగిన మైకంలో పది నెలల శిశువుని రూ. లక్షకి విక్రయించిన తల్లి

Mother

Mother

వేములవాడ పట్టణంలో దారుణం చోటుచేసుకుంది. ఓ తల్లి తాగిన మైకంలో తన పది నెలల శిశువుని రూ. లక్షకి విక్రయించింది. నిన్న సిరిసిల్ల కల్లు మండువాలో బేర సారాలు జరిగినట్లు సమాచారం. బత్తుల శ్యామలకు ఐదుగురు పిల్లలు ఉన్నారని.. వారిలో చిన్న పాపను ఇస్తారని తెలిసి వేములవాడకు వచ్చినట్లు జగిత్యాల జిల్లా కేంద్రానికి చెందిన లక్ష్మి వెల్లడించింది. రూ. లక్షకి వేములవాడ మున్సిపల్ పరిధిలోని తిప్పాపూర్ లో కొనుగోలు చేశామని, రూ. 90 వేలలకు విక్రయించి బాండ్ పేపర్ రాసుకున్నమని తెలిపిలంది. తన పాపను అపహరణ చేశారని శ్యామల పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు బాలిక తల్లికి పాపను అప్పగించారు. తన దగ్గర తీసుకున్న డబ్బులు తిరిగి ఇవ్వాలని లక్ష్మి డిమాండ్ చేస్తోంది. ఈ కేసును పోలీసులు విచారిస్తున్నారు.

READ MORE: PM Modi Xi Jinping: ఐదేళ్ల తర్వాత ప్రధాని మోడీ, జిన్ పింగ్ భేటీ..

Exit mobile version