NTV Telugu Site icon

Pune Porsche case: 300పేజీల వ్యాసం కోర్టుకు సమర్పించిన మైనర్.. ఏం రాశాడంటే..?

Pune Porsche Case

Pune Porsche Case

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన పూణె పోర్షే కేసు మైనర్ నిందితుడు తన 300 పదాల వ్యాసాన్ని బాంబే కోర్టుకు అందజేశాడు. జేజేబీ ఆదేశం ప్రకారం.. తన 300 పదాల వ్యాసాన్ని సమర్పించాడు. మద్యం మత్తులో పోర్షే కారును నడుపుతూ.. ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టి, ఇద్దరు మరణానికి ఆ నిందితుడు కారణమన్న విషయం తెలిసిందే. అతడికి బెయిల్ మంజూరు చేస్తూ..300 పేజీల పదాల వ్యాసం రాయాలని కోర్టు ఆదేశించింది కోర్టు.

READ MORE: Pinnelli Ramakrishna Reddy: పిన్నెల్లికి రెండు రోజుల పాటు పోలీస్ కస్టడీ..

వ్యాసంలో మైనర్ పేర్కొన్న వివరాల ప్రకారం.. ప్రమాదం సమయంలో పోలీసులతో ఇబ్బంది పడతానని భయపడ్డట్లు తెలిపాడు. ఇలాంటి రోడ్డు ప్రమాదాలు జరిగిన తర్వాత ప్రజలు పరుగులు తీయకుండా పోలీస్ స్టేషన్‌కు వెళ్లాలని రాశాడు. మే 19వ తేదీ రాత్రి ప్రమాదం జరిగిన తర్వాత తాను భయపడి ఎవరినీ సంప్రదించలేదని కూడా రాశాడు. ప్రమాదం జరిగిన వెంటనే ఏం చేయాలో తెలియక అక్కడి నుంచి పారిపోయానని తెలిపాడు. స్థానికులు అతడిని పట్టుకుని చంపేందుకు ప్రయత్నించారని పేర్కొన్నాడు. అనంతరం మైనర్ బాలుడు ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని మైనర్ విజ్ఞప్తి చేశాడు. దీంతో పాటు ప్రమాదం జరిగిన వెంటనే పోలీసులను సంప్రదించి ప్రమాదంలో గాయపడిన వారిని ఆదుకోవాలని పేర్కొన్నాడు. కాగా.. తన 300 పదాల వ్యాసంలో.. మైనర్ నిందితుడు కళ్యాణి నగర్ ప్రమాదానికి సంబంధించి ఎటువంటి నేరాన్ని అంగీకరించలేదని వర్గాలు తెలిపాయి. మే 19న జరిగిన పూణె పోర్షే ప్రమాదంలో మధ్యప్రదేశ్​కి చెందిన ఇద్దరు టెకీలు మరణించారు. ఈ ఘటనలో నిందితుడు.. ఒక మైనర్​ అని, మద్యం తాగిన మత్తులో బండి నడిపి యాక్సిడెంట్​ చేశాడని తేలడంతో.. దేశవ్యాప్తంగా ఆగ్రహజ్వాలలు రేకెత్తాయి. నేరస్థుడికి మొదట బలహీనమైన కారణాలతో బెయిల్ మంజూరు చేయడం జరిగిందని పలువురు ఆరోపించారు.

Show comments