Kalki 2898AD : ప్రభాస్ ‘కల్కి’లో నటించనున్న ఆ మలయాళ బ్యూటీ…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా వున్నాడు.గత కొంతకాలంగా వరుస ప్లాప్స్ తో ఇబ్బంది పడ్డ ప్రభాస్ రీసెంట్ గా ‘సలార్’ మూవీతో భారీ సక్సెస్ అందుకున్నాడు.కేజీఎఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర 600 కోట్లకి పైగా కలెక్షన్స్ సాధించి ప్రభాస్ కి సాలిడ్ హిట్ ని అందించింది.సలార్ సక్సెస్ తో ఫుల్ ఫామ్ లో ఉన్న ప్రభాస్ తన తరువాత చిత్రంగా ‘కల్కి 2898AD’ మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో విశ్వనటుడు కమల్ హాసన్,బిగ్ బీ అమితాబ్ బచ్చన్ కీలక పాత్రలో కనిపించునున్నారు .ఈ సినిమాలో దీపికా పదుకొనే మరియు దిశా పటాని హీరోయిన్స్ గా నటిస్తున్నారు.హిందూ మైథలాజి కథతో సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ గా ఈ చిత్రాన్ని మేకర్స్ తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీ వేసవి కానుకగా మే 9న ఈ ఈ చిత్రాన్ని గ్రాండ్ గా రిలీజ్ చేయబోతున్నట్లు మేకర్స్ ఇటీవలే ఆఫీషియల్ గా అనౌన్స్ చేశారు.
ఇదిలా ఉంటే ఈ సినిమాలో భారీ స్టార్ కాస్ట్ యాడ్ అవుతున్నారు. అయితే ఈ సినిమాలో దర్శక ధీరుడు రాజమౌళి, దగ్గుబాటి రానా, మలయాళ హీరో దుల్కర్ సల్మాన్ కూడా గెస్ట్ రోల్స్ లో కనిపిస్తున్నట్లుగా ఇటీవల వార్తలు వినిపించాయి. అయితే దానికి సంబంధించి చిత్ర యూనిట్ నుంచి మాత్రం ఎలాంటి క్లారిటీ రాలేదు.ఇక కొద్ది రోజులుగా రౌడీ హీరో విజయ్ దేవరకొండ కూడా ఈ సినిమాలో అతిధి పాత్ర చేస్తున్నట్లు టాక్ వినిపించింది. ఇక తాజాగా ఈ సినిమాలో మలయాళ హీరోయిన్ అన్నా బెన్ ఓ కీలక పాత్రలో నటిస్తున్నట్లు సమాచారం. ఈ విషయాన్ని అన్నా బెన్ స్వయంగా ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తెలిపింది. మలయాళంలో ‘కుంబలంగి నైట్స్’ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన అన్నా బెన్ ఆ తర్వాత వరుసగా హెలెన్, సారా, కప్పేలా మరియు కాపా వంటి సినిమాలతో వరుస విజయాలు అందుకుంది. ప్రస్తుతం మలయాళం తో పాటు తమిళంలో నటిస్తోంది.
Also Read
- Rahul Gandhi: ‘‘రాహుల్ గాంధీ భయపడ్డారు’’.. అఖిలేష్ హామీతో రాయ్‌బరేలీలో పోటీ..
- US-Iran: ‘‘మా దేశం నుంచి వెళ్లిపోండి’’.. ఇరాన్ దౌత్యవేత్తలకు అమెరికా షాక్.!
- Smit Machchhar: ‘‘ఇజ్రాయెల్, భారత్.. ప్రపంచానికే హీరో’’.. స్మిత్ మచ్చర్‌కు నెతన్యాహు భారీ గౌరవం
- Saudi Arabia: సౌదీ రాజధాని రియాద్‌పై హౌతీల భారీ దాడి..
తాజావార్తలు
-
Prahaar : సాలిడ్ సక్సెస్ కోసం యంగ్ హీరోపై చాలా నమ్మకం పెట్టుకున్న నిర్మాణ సంస్థ
-
Legendary Director Singeetham Srinivasa Rao : తెలుగు సినిమా ప్రమోగశాల మూతపడింది..
-
Rahul Gandhi: ‘‘రాహుల్ గాంధీ భయపడ్డారు’’.. అఖిలేష్ హామీతో రాయ్‌బరేలీలో పోటీ..
-
Oben Rorr EVO: 180KM రేంజ్.. 8 ఏళ్ల బ్యాటరీ వారంటీ.. దేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న ఎలక్ట్రిక్ బైక్ ఇదే..!
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!