Double Ismart :ఉస్తాద్ రామ్ పోతినేని హీరోగా డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరిజగన్నాథ్ తెరకెక్కిస్తున్న లేటెస్ట్ మూవీ “డబుల్ ఇస్మార్ట్”. గతంలో వచ్చిన బ్లాక్ బస్టర్ మూవీ ఇస్మార్ట్ శంకర్ కు సీక్వెల్ గా ఈ సినిమా తెరకెక్కుతుంది.ఇస్మార్ట్ శంకర్ మూవీ దర్శకుడు పూరి జగన్నాథ్ ,హీరో రామ్ పోతినేని కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది.అయితే ఈ మూవీ తరువాత ఇద్దరికీ వరుస ఫ్లాప్స్ ఎంతో ఇబ్బంది పెట్టాయి.విజయ్ దేవరకొండతో తెరకెక్కించిన లైగర్ సినిమా భారీ డిజాస్టర్ గా నిలవడంతో పూరి కెరీర్ కాస్త రిస్క్ లో పడింది.ఈ సారి రామ్ తో ఇస్మార్ట్ శంకర్ వంటి భారీ హిట్ అందుకోవాలని డబుల్ ఇస్మార్ట్ మూవీని తెరకెక్కిస్తున్నారు.డబుల్ ఇస్మార్ట్ మూవీని పూరి ,ఛార్మి కౌర్ గ్రాండ్ గా నిర్మిస్తున్నారు.
Read Also :OG : ‘ఓజి’ మూవీ ఫస్ట్ సింగిల్ పై క్రేజీ న్యూస్ వైరల్.
అయితే రీసెంట్ గా ఈ మూవీ టీజర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు.టీజర్ తో పూరి మరోసారి ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాడు.రామ్ మరోసారి తన మాస్ డైలాగ్స్ తో అదరగొట్టాడు. డబుల్ ఇస్మార్ట్ లో హీరో రామ్ సరసన కావ్య థాపర్ హీరోయిన్ గా నటిస్తుంది.బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ ఈ సినిమాలో విలన్ గా నటిస్తున్నారు. ఇదిలా ఉంటే తాజాగా డబుల్ ఇస్మార్ట్ నుంచి మేకింగ్ వీడియోను రిలీజ్ చేశారు.ప్రస్తుతం ఈ మేకింగ్ వీడియో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది.దర్శకుడు పూరీజగన్నాధ్ డబుల్ ఇస్మార్ట్ లో ఇస్మార్ట్ శంకర్ కు మించి యాక్షన్ సీన్స్ ప్లాన్ చేస్తున్నాడు.మెలోడీ బ్రహ్మ మణిశర్మ ఈ సారి కూడా మాస్ ట్యూన్స్ తో అదరగొట్టేందుకు సిద్ధం అయ్యాడు.త్వరలోనే మేకర్స్ ఈ మూవీకి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ఇవ్వనున్నారు.