Site icon NTV Telugu

Guntur Kaaram : గుంటూరు కారం ఓటీటీ వెర్షన్ లో ఆ సీన్స్ యాడ్ చేయనున్న మేకర్స్..?

Whatsapp Image 2024 01 30 At 12.43.40 Pm

Whatsapp Image 2024 01 30 At 12.43.40 Pm

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన లేటెస్ట్ మూవీ గుంటూరు కారం.. సంక్రాంతి కానుకగా జనవరి 12 న రిలీజ్ అయిన గుంటూరు కారం  మూవీ థియేటర్లలో భారీగా వసూళ్లను రాబట్టింది. మహేష్‌బాబు కెరీర్‌లో అత్యధిక వసూళ్లను రాబట్టిన సినిమాల్లో ఒకటిగా నిలిచింది.ఈ మూవీ 18 రోజుల్లో వరల్డ్ వైడ్‌గా 240 కోట్ల వరకు గ్రాస్‌ను 122 కోట్లకుపైగా షేర్ వసూళ్లను రాబట్టింది. ఏపీ మరియు తెలంగాణలోని చాలా చోట్ల గుంటూరు కారం మూవీ లాభాల్లోకి అడుగుపెట్టింది. నైజాం ఏరియాలో దాదాపు నలభై కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో రిలీజైన ఈ మూవీ ఇప్పటివరకు 34 కోట్లకుపైగా కలెక్షన్స్ రాబట్టింది. వరల్డ్ వైడ్‌గా దాదాపు 135 కోట్ల వరకు ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన ఈ మూవీ లాభాల్లోకి అడుగుపెట్టాలంటే మరో పన్నెండు కోట్లకుపైగా వసూళ్లను సాధించాల్సి ఉందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.అయితే గుంటూరు కారం ఓటీటీ రిలీజ్ డేట్‌పై ఓ ఆసక్తికర వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది..

ఓటీటీ వెర్షన్‌లో కొన్ని కొత్త సీన్స్ యాడ్ చేయబోతున్నట్లు సమాచారం. థియేటర్లలో నిడివి ఎక్కువ కావడంతో అమ్మ సాంగ్‌తో పాటు కబడ్డీ బ్యాక్‌డ్రాప్‌లో వచ్చే యాక్షన్ ఎపిసోడ్‌ను కూడా మేకర్స్ కట్ చేసారు.. దీనితో ఈ అమ్మ సాంగ్‌, కబడ్డీ యాక్షన్ సీన్‌ను ఓటీటీలో యాడ్ చేసి రిలీజ్ చేయబోతున్నట్లు తెలిసింది. కబడ్డీ యాక్షన్ ఎపిసోడ్ ఫైట్ ఓటీటీ ఫ్యాన్స్‌ను ఆకట్టుకుంటుందని సమాచారం..గుంటూరు కారం మూవీ ఓటీటీ హక్కులను నెట్‌ఫ్లిక్స్ దక్కించుకున్నది. మహేష్‌బాబుకు తెలుగులో ఉన్న క్రేజ్ కారణంగా థియేట్రికల్ రిలీజ్‌కు ముందే నలభై కోట్లకు నెట్‌ఫ్లిక్స్ గుంటూరు కారం డిజిటల్ రైట్స్‌ను కొనుగోలు చేసినట్లు చసమాచారం.ఈ మాస్ అండ్ యాక్షన్ మూవీ ఫిబ్రవరి 9 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానున్నట్లు సమాచారం. అయితే త్వరలోనే ఓటీటీ రిలీజ్ డేట్‌పై అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రాబోతున్నట్లు తెలుస్తుంది.

Exit mobile version