విశాల్ తన సొంత నిర్మాణ సంస్థ కోసం సినీ ఫైనాన్షియర్ అన్బుచెజియన్ కు చెందిన గోపురం ఫిల్మ్స్ వద్ద 21 కోట్ల 29 లక్షల రూపాయలు అప్పు తీసుకున్నాడు. అయితే ఈ మొత్తాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ చెల్లించింది. అయితే ఈ మొత్తాన్ని విశాల్ తిరిగి చెల్లించేవరకు అతని అన్నిసినిమా హక్కులను లైకాకు ఇవ్వాలనే ఒప్పందాన్ని కూడా కుదుర్చుకుంది. అయితే ఈ ఒప్పందాన్ని ఉల్లంఘించి వీరమే వాగై చూడం సినిమాను విడుదల చేసినందుకు విశాల్‌పై లైకా ప్రొడక్షన్ మద్రాస్ హైకోర్టులో కేసు పెట్టింది.ఈ కేసును విచారించిన సింగిల్ జడ్జి రూ.15 కోట్లు డిపాజిట్ చేయాలని ఆదేశించారు. ఈ ఉత్తర్వును సమర్థించిన ద్విసభ్య ధర్మాసనం, మొత్తం చెల్లించని పక్షంలో సింగిల్ జడ్జి ముందు ఈ కేసులో తీర్పు వెలువడే వరకు విశాల్ నిర్మించిన చిత్రాలను థియేటర్లలో లేదా ఓటీటీ లో విడుదల చేయడాన్ని నిషేధించాలని ఆదేశించింది. ఈ కేసును విచారించిన హైకోర్టు 2021 జనవరి నుంచి ఇప్పటి వరకు విశాల్‌కు చెందిన నాలుగు బ్యాంకు ఖాతాల ఖాతా వివరాలను, విశాల్‌కు చెందిన స్థిరాస్తుల ఆస్తుల పత్రాలతో పాటు వాటిని ఎప్పుడు కొనుగోలు చేశారనే వివరాలను కూడా దాఖలు చేయాలని ఆదేశించింది.అయితే గతంలో ఈ కేసు విచారణకు విశాల్ తరపున న్యాయవాది కోర్ట్ కు హాజరుకాలేదు.
కోర్ట్ ఆదేశించిన నాలుగు బ్యాంకు ఖాతాల వివరాలు, స్థిరాస్తుల వివరాల పత్రాలను విశాల్ సమర్పించకపోవడంతో సెప్టెంబర్ 22న విశాల్ స్వయంగా హాజరుకావాలని కోర్ట్ ఆదేశించింది. ఈ కేసు శుక్రవారం మరోసారి విచారణకు అయితే వచ్చింది. కోర్టు ఆదేశాల మేరకు పత్రాలు దాఖలు చేయనందున విశాల్‌పై కోర్టు ధిక్కరణ కింద ఎందుకు చర్యలు తీసుకోకూడదని న్యాయమూర్తి ప్రశ్నించడం జరిగింది.. విశాల్ తనను కోర్టు కంటే గొప్పగా భావించకూడదు. కోర్టు ముందు అందరూ సమానమే అని న్యాయమూర్తి అన్నారు.దీనితో విశాల్ తరపు న్యాయవాది మాట్లాడుతూ.. ‘బ్యాంకు నుంచి డాక్యుమెంట్లు రావడంలో కొంత ఆలస్యం జరిగిందని.. దీంతో కోర్టు కోరిన పత్రాలు నిన్న ఆన్‌లైన్‌లో దాఖలయ్యాయి. దీంతో న్యాయమూర్తి జోక్యం చేసుకుని ఆన్‌లైన్‌లో పత్రాల దాఖలును నిర్ధారించకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు.ఆస్తి వివరాలు దాఖలు చేయడానికి మరో 6 రోజుల సమయం కోరారు విశాల్ తరపు న్యాయవాది. తదుపరి విచారణ సమయంలో విశాల్ 28 రోజుల పాటు షూటింగ్‌లకు హాజరుకావాల్సి ఉన్నందున వ్యక్తిగతంగా హాజరుకాకుండా మినహాయింపు ఇవ్వాలని అయితే విశాల్ కోరారు. దీనిని అంగీకరించిన న్యాయమూర్తి.. బ్యాంకుల నుంచి అదనపు పత్రాలు పొందేందుకు అలాగే కోర్టు కోరిన పత్రాల వివరాలను సమర్పించేందుకు గడువు ఇస్తూ విచారణను సెప్టెంబర్ 25కి వాయిదా వేయడం జరిగింది.అంతేకాదు తదుపరి విచారణకు హాజరుకాకుండా విశాల్‌కు మినహాయింపు ఇవ్వాలని కూడా కోర్ట్ ఆదేశించింది.