NTV Telugu Site icon

Fact Check: ఆసుపత్రిలో మన్మోహన్ సింగ్ చివరి ఫొటో వైరల్..

Fact Check

Fact Check

దేశ మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ గురువారం రాత్రి హఠాన్మరణం చెందారు. సోషల్ మీడియాలో ఆయనకు ప్రజలు నివాళులు అర్పిస్తున్నారు. కొంతమంది వినియోగదారులు మన్మోహన్ సింగ్ ఆసుపత్రిలో మంచం మీద పడుకున్న చిత్రాన్ని పంచుకున్నారు. ఈ చిత్రాన్ని షేర్ చేస్తూ.. “ఇది మన్మోహన్ సింగ్ చివరి క్షణాల ఫొటో” అని పేర్కొంటున్నారు. వైరల్ అవుతున్న ఫోటోలో నిజమెంతో తెలుసుకుందాం..

READ MORE: JC Prabhakar Reddy Apologies: వారికి క్షమాపణలు చెప్పిన జేసీ ప్రభాకర్‌ రెడ్డి.. హాట్‌ టాపిక్‌..!

మన్మోహన్ సింగ్ చిత్రాన్ని సోషల్ మీడియా ప్లాట్ ఫాం ఎక్స్ ఖాతాదారు షేర్ చేస్తూ.. “మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మరణానికి ముందు చివరి చిత్రం! భావోద్వేగ నివాళి.” అని రాసుకొచ్చారు. చాలా మంది దీన్ని షేర్ చేశారు. కానీ.. ఈ ఫొటోపై ఓ జాతీయ మీడియా సంస్థ దర్యాప్తు చేసింది. ఇది మన్మోహన్ సింగ్ చివరి ఫోటో కాదని స్పష్టమైంది. ఇది మూడు సంవత్సరాల కిందటి ఫొటో అని తేలింది. 2021లో మన్మోహన్ సింగ్ అనారోగ్యం పాలయ్యారు. ఢిల్లీలోని ఎయిమ్స్‌లో చేరిన మాజీ ప్రధానిని చూసేందుకు అప్పటి కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవియా ఎయిమ్స్‌కు చేరుకున్నారు. అప్పటి ఫొటోను కొంచెం ఎడిట్ చేసి తాజా ఫొటో లాగా చూపించే ప్రయత్నం చేశారని తేలింది.

READ MORE: Megastar : భారత మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ మృతిపై చిరంజీవి సంతాపం

కాగా.. కాగా.. కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న మన్మోహన్‌ సింగ్‌.. నిన్న ఇంట్లో అకస్మాత్తుగా స్పృహ కోల్పోయారు. రాత్రి 8:06 గంటలకు ఎయిమ్స్‌లోని మెడికల్ ఎమర్జెన్సీకి తరలించారు. రాత్రి 9:51 గంటలకు మన్మోహన్‌ కన్నుమూసినట్టు ఎయిమ్స్ ప్రకటించింది. 1932 సెప్టెంబర్‌ 26న అవిభక్త భారత్‌లోని పంజాబ్‌ రాష్ట్రంలో జన్మించిన మన్మోహన్‌ సింగ్‌.. 2004 నుంచి 2014 వరకు ప్రధానిగా సేవలందించారు. దేశాన్ని సుదీర్ఘకాలం పాలించిన ప్రధానుల్లో మన్మోహన్‌ ఒకరు.. 1991 నుంచి 1996 వరకు పీవీ కేబినెట్‌లో ఆర్థికమంత్రిగా సేవలందించారు.. ఎన్నో ఆర్థిక సంస్కరణలు చేపట్టిన వ్యక్తిగా పేరుగాంచారు.. 1991 అక్టోబర్‌లో తొలిసారిగా రాజ్యసభలో అడుగు పెట్టారు.. ఐదు సార్లు అసోం నుంచి రాజ్యసభకు ప్రాతినిధ్యం వహించారు. ప్రధానిగా, ఆర్థిక మంత్రిగా, రాజ్యసభ సభ్యుడిగా, వాణిజ్య మంత్రిత్వశాఖ సలహాదారుగా, ఆర్థికశాఖ ప్రధాన సలహాదారుగా, ఆర్థిక మంత్రిత్వశాఖ కార్యదర్శిగా, ప్రణాళిక సంఘం ఛైర్మన్‌గా, ఆర్బీఐ గవర్నర్‌గా, ప్రధాని సలహాదారుగా, యూనివర్సిటీ గ్రాంట్స్‌ కమిటీ ఛైర్మన్‌ వంటి బాధ్యతలు నిర్వర్తించారు.

Show comments