NTV Telugu Site icon

The Kerala Story OTT: ఓటీటీలోకి వచ్చేసిన సూపర్ హిట్ మూవీ.. ఎక్కడ స్ట్రీమింగంటే?

Keralaaaa

Keralaaaa

ఈ మధ్య స్టార్ హీరోల సినిమాలు లేదా భారీ బడ్జెట్ తో తెరకేక్కుతున్న సినిమాలు విడుదలకు ముందే భారీ ధరకు ఓటీటి రైట్స్ కూడా అమ్ముడు పోతుంటాయి.. ఇక మరికొన్ని సినిమాల విషయంలో విడుదల తర్వాత కలెక్షన్ల ఆధారంగా చిన్న లేదా పెద్ద డిజిటల్ స్ట్రీమింగ్ ప్లాట్ ఫామ్ లు సినిమా ఓటీటీ రైట్స్ ను కొనుగోలు చేస్తాయి.. కొన్ని సినిమాలు బాక్సాఫీస్ వద్ద మంచి హిట్ ను అందుకున్నా కూడా ఇప్పటికీ డిజిటల్ రిలీజ్ కి నోచుకోలేకపోయాయి. అలాంటి సినిమాలలో ఒక సినిమానే ది కేరళ స్టోరీ.

ఆదా శర్మ, యోగితా బలానీ, సిద్ది ఇద్నానీ, సొనియా బలానీ ప్రధాన పాత్రలు పోషించిన ఈ సినిమాకి సుదిప్టో సేన దర్శకత్వం వహించారు. ప్రముఖ నిర్మాణ సంస్థ సన్‌షైన్ పిక్చర్స్ బ్యానర్‌పై విపుల్ అమృత్‌లాల్ షా ఈ చిత్రాన్ని నిర్మించారు.. అన్ని కలిపి ఈ సినిమాకు 28 కోట్లకుపైగా బడ్జెట్‌ ఖర్చయింది. మొత్తంగా సుమారుగా 35 కోట్ల వరకు ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. అంటే 37 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో ఈ సినిమా భారత దేశం లో 2000 స్క్రీన్లలో రిలీజైంది. ఎన్నో వివాదాల మధ్య గతేడాది మే 5వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం మొదటి రోజు నుంచే భారీగా కలెక్షన్లను రాబట్టింది..

ఈ సినిమా మొత్తానికి భారీగా కలెక్షన్ల ను అందుకుంది.. అయితే ఈ సినిమా విడుదలై చాలా రోజులు అయ్యింది.. ఇప్పుడు ఇన్ని రోజులకు ఓటీటీ బిజినెస్ కాకపోవడంతో నిర్మాతలు ఈ సినిమాను కనీసం యూట్యూబ్‌ లో రిలీజ్ చేద్దాం అని ప్లాన్స్ కూడా చేశారు. కానీ ఆఖరి నిమిషం లో జీ 5 వారు ఈ చిత్ర డిజిటల్ రైట్స్ ను కొనుగోలు చేశారు. ఎట్టకేలకు శుక్రవారం (అర్ధరాత్రి) నుంచి అదాశర్మ ను ఓటీటీలోకి అందుబాటులోకి తీసుకొచ్చింది.. ప్రస్తుతం భారీ రెస్పాన్స్ తో దూసుకుపోతుంది…

Show comments