NTV Telugu Site icon

CM Revanth Tweet: ఒక జర్నలిస్టు నాకు ఫోటో పంపాడు.. అది చూస్తుంటే..

Cm

Cm

CM Revanth Tweet: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఓ జర్నలిస్ట్ పంపిన ఫోటో సంచలనంగా మారింది. ఆ ఫోటోలను సీఎం రేవంత్ రెడ్డి తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు. సిద్ధిపేట జిల్లా నంగునూరు మండలం, మగ్దుంపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చదువుతున్న ఈ బాలికలను చూస్తుంటే ఆనందంగా ఉందంటూ తెలిపారు. ఊరికి కిలో మీటర్ దూరాన ఉన్న పాఠశాలకు రూపాయి ప్రయాణ ఖర్చు లేకుండా వెళ్లగలుగుతున్నారంటూ చాలా ఆనందంగా ఉందని అన్నారు.

ప్రజా ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణ పథకం వల్ల మేం ఉచితంగా బస్సెక్కి స్కూలుకు వెళ్లగలుగుతున్నాం అని తమ చేతిలో ఆధార్ కార్డులు చూపిస్తూ వాళ్లంతా సంతోషం వ్యక్తం చేస్తుంటే.. చాలా ఆనందం వేసిందని తెలిపారు. ఒక జర్నలిస్టు మిత్రుడు ఈ ఫోటో తీసి నాకు పంపాడు. అది చూసిన నాకు చాలా ఆనందంగా ఉందంటూ ట్వీట్ వేదిగా పోస్ట్ చేశారు సీఎం రేవంత్ రెడ్డి. ఫ్రీ బస్సు జర్నీ మహిళల కోసమే కాకుండా సూళ్లకు వెళ్లే అమ్మాయిలకు కూడా ఎంత ఉపయోగ పడుతుందో ఈ ఫోటో చూస్తే అర్థమవుతుందని హర్షం వ్యక్తం చేశారు. ఇది మా కాంగ్రేస్ సర్కారు పాలన అంటూ రేవంత్ చేసిన ట్వీట్ సంచలనంగా మారింది.

Read also: Kamareddy: రైతుపై బ్యాంకు అధికారుల కఠినత్వం.. రుణం చెల్లించలేదని భూముల వేలం

అంతేకాకుండా మరోవైపు రాష్ట్రంలోని అక్కాచెల్లెళ్లకు తెలంగాణ ప్రభుత్వం మరో శుభవార్త చెప్పిన విషయం తెలిసిందే.. మహిళా శక్తి పథకం కింద మరో సేవను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో ‘మహిళా శక్తి – క్యాంటీన్‌ సర్వీసెస్‌’ ఏర్పాటుకు సీఎస్‌ శాంతి కుమారి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు రాష్ట్రంలో ‘మహిళా శక్తి – క్యాంటీన్‌ సేవలు’ ఏర్పాటు చేస్తున్నట్లు సీఎస్‌ శాంతి కుమారి వెల్లడించారు. రాష్ట్రంలో మహిళా సంఘాలను ఆర్థికంగా బలోపేతం చేయాలన్న ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు మహిళా సంఘాల నిర్వహణకు అన్ని ప్రధాన కార్యాలయాలు, కలెక్టరేట్లు, పర్యాటక ప్రాంతాలు, దేవాలయాలు, బస్టాండ్లు, పారిశ్రామికవాడల్లో ప్రత్యేక క్యాంటీన్లను ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటికే కేరళలో అన్నా క్యాంటీన్లు, బెంగాల్ లో దీదీ క రసోయ్ పేరుతో నడుస్తున్న క్యాంటీన్ల పనితీరును అధ్యయనం చేసినట్లు వివరించారు.
Jayam : 22 ఏళ్లు పూర్తి చేసుకున్న నితిన్ క్లాసిక్ మూవీ..