NTV Telugu Site icon

Shirisha Murder Case: శిరీష మృతి కేసులో దర్యాప్తు ముమ్మరం.. ఘటనా స్థలాన్ని పరిశీలించిన ఎస్పీ..!

Shirisha

Shirisha

Shirisha Murder Case: రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపిన శిరీష అనుమానాస్పద మృతి కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. శిరీష ఎక్కడైతే మృతి చెందిందో.. ఆ ప్రాంతాన్ని జిల్లా ఎస్పీ కోటిరెడ్డి పరిశీలించారు. అనంతరం శిరీష ఇంటికి వెళ్ళి శిరీష తల్లిదండ్రులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. అంతేకాకుండా శిరీష మృతికి ముందు ఇంట్లో జరిగిన గొడవపై కూడా ఆరా తీశారు. నిన్న (సోమవారం) బావ అనిల్, అదే గ్రామానికి చెందిన ఇద్దరు యువకులను పోలీసులు ప్రశ్నించారు.

Read Also: CM YS Jagan: పుట్టే బిడ్డ దగ్గర నుంచి ప్రతి ఒక్కరికీ ఆరోగ్యశ్రీ కార్డు.. సీఎం ఆదేశాలు

మృతికి ముందు సెల్ ఫోన్ విషయంలో బావ అనిల్ తో గొడవ పడి ఇంట్లోనే ఆత్మహత్య చేసుకునే ప్రయత్నం చేసినట్టు ఎస్పీ కోటిరెడ్డి పేర్కొన్నారు. ఆ తర్వాత బయటకు వెళ్ళి ఆత్మహత్య చేసుకుందా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నామని ఎస్పీ తెలిపారు. యువతి దేహంపై ఉన్న గాయాల ఆధారంగా బయటి వ్యక్తులు హత్య చేసి ఉంటారనే కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నామన్నారు. యువతి శరీరంపై ఉన్న గాయాల ఆధారంగా పోస్ట్ మార్టం కూడా పూర్తయ్యిందని.. ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ వచ్చాక పూర్తి వివరాలు వెల్లడిస్తామని ఎస్పీ తెలిపారు.

Read Also: Producer T.G. Vishwaprasad: పాన్ వరల్డ్, హాలీవుడ్ ప్రాజెక్టులే మా టార్గెట్..

అయితే.. ఇంట్లో ఉన్న వాతావరణం వల్ల యువతి మనస్థాపం చెంది ఉంటుందని భావిస్తున్నామని.. ఫోన్ లాక్ ఉన్నందున దాన్ని సైబర్ క్రైం కు పంపించి ఫోన్ పూర్తి డాటా తీయిస్తామన్నారు.
ఫోన్ డేటా, ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్, సాంకేతిక ఆధారాల ద్వారా కేసును ఛేదిస్తామని ఎస్పీ పేర్కొన్నారు. అయితే శిరీషది హత్యా.. లేక ఆత్మహత్య అనేది పూర్తి దర్యాప్తు తర్వాత వివరాలు వెల్లడిస్తామని ఎస్పీ కోటిరెడ్డి తెలిపారు.