చిన్న సినిమాలకు సెన్సార్ కష్టాలు కొత్తేమీ కాదు. తాజాగా అలాంటి సమస్యలతో సతమతమవుతున్న సినిమా ‘వనవీర’. మొదట ఈ చిత్రాన్ని ‘వానర’ అనే టైటిల్‌తో తెరకెక్కించగా, సెన్సార్ టీమ్ నుంచి అభ్యంతరాలు వ్యక్తం కావడంతో టైటిల్‌ను మార్చాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో యూనిట్ ఒక్కసారిగా షాక్‌కు గురైంది.టైటిల్ మార్పుతో పాటు సినిమాపై ఆడియెన్స్‌లో అవగాహన కల్పించేందుకు మేకర్స్ ఇప్పుడు భారీ స్థాయిలో ప్రమోషన్స్ నిర్వహిస్తున్నారు. కొత్త టైటిల్ అయిన ‘వనవీర’ను ప్రేక్షకుల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం జోరుగా సాగుతోంది.
Also Read : Thalapathy Vijay : ఫ్యాన్స్ అత్యుత్సాహం.. కిందపడిన ‘దళపతి విజయ్’
ఇదిలా ఉండగా, జనవరి 1న విడుదలకు సిద్ధమవుతున్న ఈ సినిమాకు ఇంకా సెన్సార్ సర్టిఫికెట్ రాలేదన్న సమాచారం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. రిలీజ్‌కు కేవలం మూడు రోజుల సమయం మాత్రమే ఉండటంతో యూనిట్‌లో టెన్షన్ వాతావరణం నెలకొంది. అయితే, సెన్సార్ సమస్యలు ఒకవైపు ఉన్నా, సినిమా గురించి వినిపిస్తున్న ఇన్‌సైడ్ టాక్ మాత్రం చాలా పాజిటివ్‌గా వినిపిస్తోంది. కథ, కథనం ఆకట్టుకునేలా ఉండటంతో పాటు సెకండాఫ్ లో క్యామియో చేసిన స్టార్ కమెడియన్ సీన్స్ సూపర్ గా వర్కౌట్ టాక్. అవినాష్ తిరు వీధుల హీరోగా, డైరెక్టర్‌గా ఎంట్రీ ఇస్తుండగా తొలి సినిమా అయినప్పటికీ, ఎక్కడా తడబడకుండా కథను చక్కగా డీల్ చేశాడని ఈ సినిమాను ఇప్పటికే చూసిన కొందరు డిస్ట్రిబ్యూటర్స్ నుండి వినిపిస్తున్న సమాచారం. కాగా ఈ సినిమాను నైజాంలో ఏషియన్ సునీల్ కు చెందిన ఏషియన్ సినిమాస్ రిలీజ్ చేస్తోంది. రూరల్ డ్రామాతో ‘వన వీర’ తెరకెక్కగా గ్రామంలో జరిగిన పొలిటికల్ వార్, సెన్సిటివ్ ఇష్యూష్‌తో పాటు డివోషనల్ టచ్ తో జనవరి 1న వస్తున్న ఈ సినిమాలో సిమ్రాన్ చౌదరి హీరోయిన్ గా నటిస్తోంది. అవినాష్ బుయానీ, ఆలపాటి రాజా, సి. అంకిత్ రెడ్డి ఈ సినిమాను నిర్మించారు.
