NTV Telugu Site icon

Asian Hockey Champions Trophy: తొలి మ్యాచ్‌లో మలేషియాపై భారీ విజయం సాధించిన భారత జట్టు

Asian Hockey Champions Trophy

Asian Hockey Champions Trophy

Asian Hockey Champions Trophy: రాజ్‌గిర్‌లో జరుగుతున్న మహిళల ఆసియా హాకీ ఛాంపియన్స్ ట్రోఫీ -2024లో భారత మహిళల హాకీ జట్టు తొలి మ్యాచ్‌లో అద్భుత ప్రదర్శన చేసి మలేషియాపై 4-0తో విజయం సాధించింది. భారత మహిళల హాకీ జట్టు తరఫున సంగీత కుమారి రెండు గోల్స్ చేయగా.. ప్రీతి దుబే, ఉదిత ఒక్కో గోల్ చేశారు. బీహార్‌లోని రాజ్‌గిర్‌లో జరిగిన మ్యాచ్‌లో రెండో క్వార్టర్ మినహా మిగిలిన మూడు క్వార్టర్లలో భారత్ గోల్స్ చేసింది. తొలి క్వార్టర్‌లో భారత్‌ ఒక గోల్‌ చేసింది. దీని తర్వాత మూడో క్వార్టర్‌లో రెండు గోల్స్, నాలుగో క్వార్టర్‌లో ఒక గోల్ చేసారు. భారత్ తరఫున సంగీత కుమారి ఎనిమిది, 55వ నిమిషాల్లో గోల్స్ చేయగా.. ప్రీతి దూబే 43వ నిమిషంలో, ఉదిత 44వ నిమిషంలో గోల్స్ చేశారు. ఇక మంగళవారం భారత్‌ దక్షిణ కొరియాతో ఆడాల్సి ఉంది.

Read Also: Vikram Misri: విదేశాంగ కార్యదర్శి విక్రమ్‌ మిస్రీ పదవీకాలాన్ని పొడిగించిన కేంద్రం

అయితే, మలేషియాతో జరిగిన మ్యాచ్‌లో భారత్ గోల్స్ తేడాతో గెలిచినా.. కానీ, పెనాల్టీ కార్నర్‌లను గోల్‌గా మార్చడంలో జట్టు ఆటగాళ్లు విఫలమయ్యారు. మొత్తం మ్యాచ్‌లో భారత్‌కు 13 పెనాల్టీ కార్నర్‌లు లభించాయి. అయితే వాటిలో ఆటగాళ్లు కేవలం మూడింటిని మాత్రమే గోల్‌గా మార్చగలిగారు. నేడు సాయంత్రం బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ టోర్నీని లాంఛనంగా ప్రారంభించారు.

Read Also: Border Gavaskar Trophy: బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ.. ఇప్పటి వరకు ఎవరెన్నిసార్లు టైటిల్ గెలుచుకున్నారంటే

Show comments