పారిస్ ఒలింపిక్స్ 2024లో ఈరోజు (13వ రోజు) భారత్‌కు ప్రత్యేకమైనది. కాంస్య పతక పోరులో భారత హాకీ జట్టు నేడు స్పెయిన్‌తో తలపడనుంది. వాల్ ఆఫ్ ఇండియాగా పేరొందిన పీఆర్ శ్రీజేష్ తన చివరి మ్యాచ్లోనూ పతకం సాధిస్తాడని అభిమానులు ఆశిస్తున్నారు.
Read Also: Neeraj Chopra: పతకాలను సంఖ్యను పోల్చడం ఏమత్రం సరికాదు: నీరజ్
సెమీఫైనల్‌లో జర్మనీ చేతిలో పరాజయం పాలైన బాధను మరచిపోయిన భారత హాకీ జట్టు చివరిసారిగా పారిస్ ఒలింపిక్స్‌లో స్పెయిన్‌తో మూడో స్థానం కోసం ప్లేఆఫ్‌లో అడుగుపెట్టనుంది. టోర్నీ ఆద్యంతం ఛాంపియన్‌గా ఆడిన భారత జట్టు.. మంగళవారం జరిగిన ఉత్కంఠ పోరులో జర్మనీ చేతిలో 2-3 తేడాతో ఓటమిపాలై 44 ఏళ్ల తర్వాత ఒలింపిక్ స్వర్ణ పతకాన్ని చేజిక్కించుకోవాలన్న కల కలగానే మిగిలిపోయింది. కాగా.. హర్మన్‌ప్రీత్ సింగ్ నేతృత్వంలోని హాకీ జట్టు స్పెయిన్‌తో కాంస్య పతక ప్లేఆఫ్ కోసం తలబడనుంది. ప్రపంచ హాకీ ర్యాంకింగ్స్‌లో ఐదో ర్యాంక్‌లో ఉన్న భారత్ మంగళవారం సెమీ ఫైనల్‌లో ప్రపంచ రెండో ర్యాంకర్ జర్మనీతో పరాజయం పాలైంది. ఈ ఓటమి నుంచి కోలుకుని కాంస్య పతకాన్ని కైవసం చేసుకునేందుకు ఈరోజు భారత్ రంగంలోకి దిగనుంది.
Read Also: Ponnam Prabhakar: రైతు రుణమాఫీ రాని వారి వివరాలు సేకరిస్తున్నాం..
టోక్యో ఒలింపిక్స్ 2020 తర్వాత.. భారత హాకీ జట్టు తొమ్మిది మ్యాచ్‌ల్లో స్పెయిన్‌తో తలపడింది. ఇందులో భారత్ ఐదు మ్యాచ్‌ల్లో విజయం సాధించింది. ఎఫ్‌ఐహెచ్ ప్రో లీగ్‌లో ఇరు జట్లు రెండుసార్లు తలపడ్డాయి. భారత పురుషుల హాకీ జట్టు ఇప్పటి వరకు ఒలింపిక్స్‌లో 12 పతకాలు సాధించింది. వీటిలో ఎనిమిది స్వర్ణాలు, ఒక రజతం, మూడు కాంస్య పతకాలు ఉన్నాయి. అదే సమయంలో.. స్పెయిన్ మూడు రజతాలు, ఒక కాంస్య పతకాలను గెలుచుకుంది.