NTV Telugu Site icon

IT Rides : జ్యువెలర్స్‌పై ఐటీ దాడులు.. భారీగా లెక్కల్లో చూపని సొత్తు..

It Rides

It Rides

నేడు తెల్లవారు జామున నాసిక్‌ నగరంలోని సురానా జ్యువెలర్స్‌పై ఐటీ సోదాలు జరిగాయి. కాగా., సురానా జ్యువెలర్స్‌పై యాజమాన్యం వెల్లడించని అనేక లావాదేవీల పై ఆదాయపు పన్ను శాఖ దాడులు మొదలు పెట్టింది. ఆదాయపన్ను శాఖ చేసిన దాడుల్లో దాదాపు రూ. 26 కోట్ల నగదు, రూ. 90 కోట్ల విలువైన లెక్కల్లో చూపని ఆస్తుల పత్రాలు అధికారులు స్వాధీనం చేసుకున్నారు. గత కొన్ని రోజులుగా ఆదాయపు పన్ను శాఖ మహారాష్ట్రలో చాలా యాక్టివ్‌ గా పని చేస్తోంది.

Uttarpradesh: మరో మహిళతో ప్రేమాయణం.. అడిగిన భార్య చేతిని కుట్టుమిషన్ తో కుట్టిన జవాన్

తాజాగా నాందేడ్‌ లో దాడులు నిర్వహించి ఏకంగా రూ. 170 కోట్ల విలువైన లెక్కల్లో చూపని సొత్తును స్వాధీనం చేఉకున్న సంగతి తెలిసిందే. దీని తర్వాత, ఇప్పుడు నాసిక్ లో చర్యలు తీసుకుంటుండగా మరికొన్ని కోట్ల విలువైన నగదు పట్టుబడింది. ఈ దాడి నేపథ్యంలో ఆదాయపు పన్ను శాఖ అధికారులు బంగ్లాలోని ఫర్నిచర్‌ ను మొదలగు వాటిని కూడా పగులగొట్టి నగదును స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం అందింది. అధికారులు చేసిన ఈ చర్య వల్ల నగరంలో ఈ కేసు సంచలనం సృష్టించింది.

Game Changer: గేమ్ చేంజర్లో అలాంటి పాత్ర.. అంజలి లీక్ చేసేసిందిగా..!

ఈ ఆపరేషన్ మొత్తం 30 గంటల పాటు సాగిందని., అందుగాను 50 – 60 మంది అధికారులు సురానా జ్యువెలర్స్ షాపుతో పాటు అతని రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే కార్యాలయలపై దాడులు చేశారు.

Show comments